బాలరాముడి రాకతో అక్కడ ఆర్ధిక పరిస్థితి ఇంతలా మారనుందా.? ఏడాదికి అన్ని వేల కోట్ల ఆదాయమా.?

బాలరాముడి రాకతో అక్కడ ఆర్ధిక పరిస్థితి ఇంతలా మారనుందా.? ఏడాదికి అన్ని వేల కోట్ల ఆదాయమా.?

by kavitha

అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని సోమవారం నాడు అత్యంత వైభవంగా జరిగింది.  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతిల మీదుగా ప్రాణప్రతిష్ఠ వేడుక జరిగింది. ఈ నేపథ్యంలో అయోధ్య రామమందిరం భక్తులతో కిటకిటలాడుతోంది.

Video Advertisement

సాధారణ భక్తులకు దర్శనాలు మొదలవడంతో మొదటి రోజే బాల రాముడిని దర్శించుకోవడం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో రామలయానికి పోటెత్తారు. ఈ క్రమంలో అయోధ్యకు వెళ్ళే భక్తుల సంఖ్య భారీగా పెరగనుంది. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ పరిస్థితి మారిపోనుందని వినిపిస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
అయోధ్యలో రామ మందిరంలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ గ్రాండ్ జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే దేశంలో తిరుపతి, అనంత పద్మనాభస్వామి దేవాలయం, షిర్డీ లాంటి దేవాలయాలకు భారీగా భక్తులు తరలివస్తుంటారు. దేశంలోనే ఈ దేవాలయాలు అత్యంత ధనిక దేవాలయాలుగా ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. పుణ్యక్షేత్రాలకు ప్రజలు ఎక్కువగా వెళ్తుంటారు. అది కూడా ఫ్యామిలీ అంతా వెళ్తుంది. దీనివల్ల ట్రాన్స్ పోర్ట్, రెస్టారెంట్లు, హోటల్స్ తో పాటు ఇతర బిజినెస్ లకు డిమాండ్ కూడా పెరుగుతుంది.
వివిధ రంగాలకు ఆదాయం పెరగడంతో టాక్స్ ల  రూపంలో గవర్నమెంట్స్ కు పెద్ద మొత్తంలో ఆదాయం చేకూరుతుంది. ఇటీవల శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తుల తాకిడితో 2 నెలలకు గాను 357 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. ఇక ఇప్పుడు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం జరిగిన నేపథ్యంలో ఆధ్యాత్మిక టూరిజం పేరుగుతుందని ఎస్‌బీఐ రీసెర్చ్ అంచనా వేసింది.
ఎస్‌బీఐ నివేదిక ప్రకారం, యూపీలో రామ మందిరం నిర్మాణం మరియు  అదనపు చర్యల వల్ల 2024-25 లో యూపీ గవర్నమెంట్ కు అదనంగా 25 వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా. ఈ మొత్తం సందర్శకుల రాకతో సమకూరనుంది. దీనివల్ల రోడ్డు, రైలు, వాయురవాణా పెరిగే ఛాన్స్ ఉంది. భక్తుల సేవల గాను హోటల్స్, హాస్పటల్స్ సైతం పెరుగుతాయి.  2027 వరకు మహారాష్ట్రతో పాటుగా ఉత్తర ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 500 బిలియన్ డాలర్లను అధిగమించి, దేశ జీడీపీలో యూపీ వాటా పది శాతంగా ఉంటుందని తెలిపింది.

Also Read: “ముఖ్యమంత్రి వెళ్తేనే పది కార్లు..మరి?” అంటూ… రామమందిరానికి ఇంత ఆర్భాటం ఎందుకు అనేవాళ్ళకి గరికిపాటి స్ట్రాంగ్ కౌంటర్!

 


You may also like

Leave a Comment