Ads
అయోధ్యలో నిర్మించిన శ్రీరాముని మంత్రి ప్రారంభోత్సవ కార్యక్రమం జనవరి 22 తారీకు అనగా సోమవారం అత్యంత వైభవంగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జరుపుకొనుంది .ఈ కార్యక్రమానికి దేశ నలుమూలల నుండి ప్రజలందరూ కూడా రామ నామ కీర్తనతో మద్దతు తెలియజేయనున్నారు. దేశంలో ఉన్న అన్ని రామాలయంలోనూ రేపు ప్రత్యేక పూజలు జరగనున్నాయి.
Video Advertisement
ఇక్కడ మరో విశేషం ఏంటంటే రేపు అయోధ్య రామ మందిరంతో పాటు మరొక రామాలయం ప్రారంభోత్సవం కూడా జరగనుంది. ఒరిస్సా రాష్ట్రంలోని నయాగఢ్ జిల్లాలోని ఫతేగఢ్ గ్రామంలో ఈ మందిరాన్ని నిర్మించారు.రేపు విశిష్టమైన రోజు కావడంతో ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని ఆలయ నిర్వాహకులు దానికి తగిన ఏర్పాటు చేశారు.
ఈ ఆలయ నిర్మాణం 2017లో ప్రారంభమైంది. ఫతేఘర్‌లో సముద్ర మట్టానికి 1,800 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయం ఓ కొండపైన ఉంది. ఈ ఆలయం ఎత్తు 165 అడుగులు. బౌలమాల అనే ప్రత్యేకమైన రాయిని ఉపయోగించి దఈ ఆలయం నిర్మించడం జరిగింది. ఈ మందిర నిర్మాణంలో 150 మందికి పైగా కార్మికులు ఏడేళ్లుగా పాల్గొన్నారు. ఈ ఆలయాన్ని నిర్మాణం వెనుక ఒక చరిత్రాత్మక ప్రాధాన్యత ఉంది. ఈ పర్వతంపై గోవర్ధనుడు కొన్ని దశాబ్దాలుగా పూజలు అందుకుంటున్నాడు. అలాగే 1912లో జగన్నాథుడి నవకళేబర సమయంలో సుదర్శన్ చెట్టును ఫతేఘర్ నుండి సేకరించారు. దీనిని స్మరించుకునేందుకు గ్రామస్తులు ముందుకు వచ్చి శ్రీరామ సేవా పరిషత్ అనే కమిటీని ఏర్పాటు చేశారు.
ఈ కమిటీకి సోషల్ యాక్టివిస్ట్ అయిన భాపూర్ బ్లాక్ వైస్-చైర్‌పర్సన్ అధ్యక్షునిగా నియమితులైన తర్వాత ఈ రామ మందిర పనులను ప్రారంభించారు. జనవరి 21వ తేదీ నుంచి ఈ రామమందిర ప్రారంభోత్సవ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిసింది. ఈ ఆలయ మహోత్సవానికి హాజరు కావాల్సిందిగా పూరీ శంకరాచార్య, మహారాజుకు ఆహ్వానం అందింది. అంతేకాదు పూరీలోని ప్రముఖ జగన్నాథ ఆలయంలో ఉన్న వారితో పాటు వివిధ ఆలయాల అధికారులకు ఆహ్వానాలు పంపబడ్డాయి.
ఈ ఆలయాన్ని కూడా అయోధ్యలో జరుగుతున్నంత వైభవంగా ప్రారంభోత్సవాన్ని జరుపుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
End of Article