Ads
- చిత్రం : ది వారియర్
- నటీనటులు : రామ్ పోతినేని, కృతి శెట్టి, ఆది పినిశెట్టి.
- నిర్మాత : శ్రీనివాస చిత్తూరి
- దర్శకత్వం : ఎన్. లింగుసామి
- సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
- విడుదల తేదీ : జులై 14, 2022
The Warriorr Review స్టోరీ :
సత్య (రామ్ పోతినేని) అనే ఒక పోలీస్ ఆఫీసర్ కి గురు (ఆది పినిశెట్టి) అనే ఒక రౌడీకి మధ్య జరిగే కథ ఇది. ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన సత్య గురు చేస్తున్న పనులని ఎలా అడ్డుకున్నాడు? తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? అసలు సత్యకి, గురుకి మధ్య గొడవ ఏంటి? విజిల్ మహాలక్ష్మి (కృతి శెట్టి) ఎవరు? సత్యకి ఏమవుతుంది? ఇవన్నీ తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.
Video Advertisement
The Warriorr Review Story,Review రివ్యూ :
సినిమా ట్రైలర్ చూసినప్పుడే సినిమా కథ ఎలా ఉండబోతోంది అని అర్థం అయ్యింది. ఈ సినిమాలో రామ్ పోలీస్ ఆఫీసర్ గా నటించారు. రామ్ ఇలాంటి ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ చేసి చాలా రోజులు అయ్యింది. మధ్యలో కొన్ని ప్రయోగాత్మక సినిమాలు కూడా చేశారు. ఈ సినిమా తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్ లో కూడా విడుదల అయ్యింది. ఇంక సినిమా కథ విషయానికి వస్తే ఇలాంటి కథ మనం చాలా సినిమాల్లో చూశాం.
ఒక కమర్షియల్ యాక్షన్ సినిమా ఎలా అయితే ఉంటుందో, ఈ సినిమా కూడా అలాగే ఉంది. సినిమా ముందుకు వెళుతూ ఉంటుంది కానీ, ప్రేక్షకులకు ఎక్కడ కూడా సినిమా చూస్తున్నప్పుడు నెక్స్ట్ ఏమౌతుంది అనే ఆసక్తి కనిపించదు. ఎందుకంటే మనకి కథ ముందే తెలుసు కాబట్టి సినిమా మనం ముందే ఊహించగలుగుతాము. ఇంక పర్ఫామెన్స్ విషయానికి వస్తే పోలీస్ ఆఫీసర్ పాత్రలో రామ్ పోతినేని చాలా బాగా నటించారు. రామ్ ఇలాంటి మాస్ క్యారెక్టర్ చేయడం ఇదే మొదటిసారి. ఈ పాత్ర కోసం రామ్ చాలా కష్టపడ్డారు అని మనకు ఈ సినిమా చూస్తుంటే అర్థమవుతుంది. అలాగే గురు పాత్రలో నటించిన ఆది పినిశెట్టి కూడా చాలా బాగా నటించారు. కానీ సినిమా చూస్తున్నంత సేపు మనకి సరైనోడు షేడ్స్ ఎక్కడో కనిపిస్తూ ఉంటాయి.
ఇంక హీరో తల్లి పాత్రలో నటించిన నదియా, అలాగే హీరోయిన్ గా నటించిన కృతి శెట్టి కూడా వాళ్ళ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. మ్యూజిక్ విషయానికి వస్తే దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఒక కమర్షియల్ సినిమాకి ఎలాంటి మ్యూజిక్ అయితే కావాలో అలాగే ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది. కొన్ని మంచి సీన్స్ కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సింక్ లేకుండా ఉండడం వల్ల అంత పవర్ ఫుల్ గా అనిపించవు.
ప్లస్ పాయింట్స్ :
- రామ్ పోతినేని
- నిర్మాణ విలువలు
- యాక్షన్ సీన్స్
- సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
- రొటీన్ స్టోరీ
- బలహీనమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
రేటింగ్ :
3/5
ట్యాగ్ లైన్ :
స్టోరీ ఎలా ఉన్నా సరే, ఒక మంచి కమర్షియల్ యాక్షన్ సినిమా చూద్దాం అనుకునేవారికి, అలాగే రామ్ పోతినేని సినిమా చాలా రోజుల తర్వాత విడుదల అయ్యింది అని అనుకునే వారికి మాత్రం ది వారియర్ సినిమా ఒక్కసారి చూడగలిగే సినిమాగా నిలుస్తుంది.
End of Article