“ఇబ్బంది ఉంటే ఇటు రాకండి..!” రామజోగయ్య శాస్త్రీ ట్వీట్ వైరల్..!

“ఇబ్బంది ఉంటే ఇటు రాకండి..!” రామజోగయ్య శాస్త్రీ ట్వీట్ వైరల్..!

by kavitha

Ads

Ramajogaiah Sastry Tweet: టాలీవుడ్ పాటల రచయిత రామజోగయ్య శాస్త్రీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన రాసిన ‘జై బాలయ్య’ సాంగ్‌ ట్రోలింగ్ అవుతోంది. ఆయన పై కూడా కొన్ని వివాదస్పద ట్వీట్లు చేస్తున్నారు. అంతే కాకుండా శాస్త్రీ పేరులో సరస్వతి పూత్ర అనే పదాన్ని తొలగించాలని ఫైర్ అవుతున్నారు. దాంతో శాస్త్రీ తనతో ఇబ్బంది ఏమైనా ఉంటే ఇటు వైపునకు రాకండి అంటూ ట్వీట్ చేశారు.

Video Advertisement

అందులో నేను రాసే ప్రతి పాటకు ప్రాణం పెట్టి మమకారంతో రాస్తాను. దయచేసి గౌరవంగా చూసేవారు మాత్రమే నాతో ప్రయాణించాలని, మా అమ్మగారి గౌరవార్థం నా పేరులో సరస్వతీ పుత్రను కలుపుకున్నానని, దీని పై వేరేవాళ్లు ఇబ్బంది పడాల్సిన పని లేదని, ఏదైనా ఇబ్బంది అనుకుంటే ఇటువైపు రావద్దని ట్విట్టర్ లో రాసుకొచ్చారు.

balakrishna-telugu addaఇక అసలు షయానికొస్తే, బాలకృష్ణ, గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న వీరసింహా రెడ్డి మూవీ నుండి జై బాలయ్య పాట శుక్రవారం రిలీజ్ అయ్యింది. తమన్ సంగీతం అందించిన ఈ పాట పై సోషల్ మీడియాలో పెద్ద దుమారం వచ్చింది. ఈ సాంగ్ పై నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి. దీనిని ఓసేయ్ రాములమ్మ సాంగ్ తో పోలుస్తూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌ ను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఆయన మళ్లీ కాపీ కొట్టారని విమర్శిస్తున్నారు. మరి కొందరు ఈ పాట రాసిన రచయిత రామజోగయ్య శాస్త్రీని కూడా ట్రోల్ చేస్తున్నారు. ఆయన పేరులోని సరస్వతీ పుత్ర పేరును తొలగించాలని అంటున్నారు.

Ramajogaiah Shastri-1 telugu adda

అయితే ఇంకో వైపు ఈ పాటకు సపోర్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు. జై బాలయ్య పాట చాలా బాగుందని, సాహిత్యం పై అవగాహన లేనివాళ్ళ కామెంట్స్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని రామజోగయ్యశాస్త్రీకి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. ఈ మధ్య కాలంలో సామాజిక మాధ్యామాల్లో పాజిటివిటీ కంటే నెగిటివిటీ ఎక్కుగా ఉంటోంది. వీటిలో ఎక్కువగా సెలబ్రిటీలు ట్రోలింగ్ గురవుతున్నారు. ఇక ఈ చిత్రాన్ని నవీన్ యర్నేని, వై రవిశంకర్ మైత్రీ మూవీమేకర్స్ పతాకం పై నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కాబోతుంది.


End of Article

You may also like