Ads
భారత దేశంలోని హిందువులకు రామాయణానికి ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. రామాయణం ఆధారంగా ఎన్నో సినిమాలు, ఎన్నో ధారావాహికల వచ్చినప్పటికీ కూడా రామానంద్ సాగర్ తారక ఎక్కించిన బుల్లితెర రామాయణం మాత్రం ఇప్పటికీ ఎవర్ గ్రీన్… దూరదర్శన్ లోకి రామాయణం అప్పట్లో ఒక సంచలనం అయింది. రికార్డు స్థాయిలో వ్యూస్ సంపాదించి భారతీయులందరికీ దగ్గర అయింది.
Video Advertisement
అయితే ఈ రామాయణం ఇప్పటివరకు రెండుసార్లు టెలికాస్ట్ అయింది. 1987 జనవరి 25 నుండి 1988 జూలై 31 వరకు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నిమిషాలకు ప్రసారమయ్యేది. మొదటిసారి టెలికాస్ట్ అయినప్పుడే ఇది లంక బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది. ఇక రెండోసారి లాక్ డౌన్ సమయంలో ఇంటి వద్ద అందరూ ఖాళీగా ఉంటున్నారని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ రెండోసారి టెలికాస్ట్ చేయాలని 2020 సంవత్సరంలో మార్చి 28 నుంచి ప్రతి రోజు ఉదయం సాయంత్రం ప్రసారం చేసేవారు.
అప్పుడు కూడా 7.7 కోట్ల వ్యూస్ తో రికార్డు సృష్టించింది. ఇప్పుడు మూడోసారి టెలికాస్ట్ అవుతున్నట్లు దూరదర్శన్ ప్రకటించింది. రాముడు మరోసారి మీ ముందుకు వస్తున్నాడు… దేశవ్యాప్తంగా అత్యంత ప్రేక్షకాధారణ పొందిన రామాయణం త్వరలోనే దూరదర్శన్ లో ప్రసారం కానుంది అని ప్రకటించింది. ఈ ప్రకటన చూసి బుల్లితెర ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
End of Article