నాగార్జున హీరోగా, లావణ్య త్రిపాఠి, రమ్య కృష్ణ హీరోయిన్లుగా నటించిన సినిమా సోగ్గాడే చిన్ని నాయన. ఈ సినిమాకి సీక్వెల్ బంగార్రాజు ఇటీవల ప్రకటించారు. మొదటి భాగంలో లాగానే ఇందులో నాగార్జున, అలాగే బంగార్రాజు పాత్ర పోషించిన నాగార్జునకి జోడీగా నటించిన రమ్య కృష్ణ కూడా నటిస్తున్నారు. ఇందులో నాగ చైతన్య కూడా హీరోగా నటిస్తున్నారు. అలాగే ఉప్పెన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన క్రితి శెట్టి ఈ సినిమాలో నాగ చైతన్యకు జోడీగా నటిస్తున్నారు.

13 nagarjuna

ఇందులో రంభ, ఊర్వశి, మేనక పాత్రలు కూడా ఉండబోతున్నాయి. ఈ పాత్రల్లో రంభగా బిగ్ బాస్ మోనాల్ గాజ్జర్, ఊర్వశి గా దర్శన బాణిక్, మేనక గా అక్షత సొనవానే నటిస్తున్నారు. బంగార్రాజు సినిమా మొత్తం సోగ్గాడే చిన్ని నాయన లో తండ్రి పాత్ర పోషించిన నాగార్జున చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాకి సోగ్గాడే చిన్ని నాయన కి దర్శకత్వం వహించిన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అనూప్ రూబెన్స్ పాటలని అందిస్తున్నా.రు అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.