కరోనా కష్టకాలంలో అందరు ఆశ్చర్యపోయే నిర్ణయం తీసుకున్న “రామోజీ రావు” గారు…మీరు సూపర్ సార్.!

కరోనా కష్టకాలంలో అందరు ఆశ్చర్యపోయే నిర్ణయం తీసుకున్న “రామోజీ రావు” గారు…మీరు సూపర్ సార్.!

by Mohana Priya

Ads

కరోనా కారణంగా ఎంతో మంది ఉద్యోగాలు కూడా ఇబ్బందుల్లో పడ్డాయి. కొంతమందికి ఉద్యోగాలు పోయాయి. కొంతమందికి వర్క్ లోడ్ పెరిగింది. మల్టీ నేషనల్ సంస్థలు కూడా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాయి.

Video Advertisement

ఈ నేపథ్యంలో అసలు లాక్ డౌన్ తర్వాత ఉద్యోగాలు ఎలా ఉండబోతున్నాయి అనే భయం అందరిలో ఏర్పడింది. అసలే మన భారతదేశంలో నిరుద్యోగ సమస్య ముందు నుంచి ఉంది. కరోనా తర్వాత ఈ సమస్య ఇంకా పెరుగుతుందేమో అనే అనుమానాలు మొదలయ్యాయి.

ఇలాంటి సమయంలో రామోజీ సంస్థల చైర్మన్ రామోజీరావు గారు అందరూ ఆశ్చర్యానికి గురయ్యేలా ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇటీవల రామోజీ రావు గారు స్థాపించిన ఛానల్ ఈటీవీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 25 సంవత్సరాల వేడుకను కూడా ఘనంగా నిర్వహించారు.

రామోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో పనిచేసే ఉద్యోగులందరికీ బోనస్ ప్రకటించారు రామోజీరావు గారు. దెబ్బకి మిగితా చానెల్స్ వాళ్ళు అందరు ఆశ్చర్యపోయారు అంట. ఇలాంటి కష్టసమయంలో కూడా పనిచేసేవారికోసం ఆలోచించి బోనస్ ప్రకటించారా అని నోరెళ్లబెట్టారంట. ఈటీవీ పెట్టినప్పటినుండి ఇప్పటివరకు సకుటుంబ సమేతంగా ఛానల్ చూసేలా ప్రోగ్రామ్స్ నిర్వహించారు. ఇకపై కూడా అదే నిబద్ధతతో ముందుకు సాగుతుందని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

భారత దేశమే కాకుండా ప్రపంచం మొత్తం కూడా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఇలాంటి సమయంలో రామోజీ రావు గారు తీసుకున్న ఈ నిర్ణయానికి అందరూ ఆశ్చర్య పోవడమే కాకుండా, ఎంతోమంది ఇది చాలా మంచి నిర్ణయం అని ప్రశంసిస్తున్నారు.

 


End of Article

You may also like