“పాపని చూసుకోవడం చేతకాదా..?” అంటూ… ట్రోల్ చేశారు… దాంతో ఆ తల్లి..? కంటతడి పెట్టిస్తున్న సంఘటన..!

“పాపని చూసుకోవడం చేతకాదా..?” అంటూ… ట్రోల్ చేశారు… దాంతో ఆ తల్లి..? కంటతడి పెట్టిస్తున్న సంఘటన..!

by Mohana Priya

Ads

సోషల్ మీడియా వల్ల ఎటువంటి సంఘటన అయినా సరే అందరికీ తెలిసిపోతుంది. దీని వల్ల ప్రభావితం చెందిన వాళ్లు కూడా ఉన్నారు. ఇది కొందరి మీద ఎమోషనల్ గా కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకు ఇటీవల జరిగిన సంఘటన ఉదాహరణ. కొన్నాళ్ల క్రితం కోయంబత్తూర్ లో ఒక చిన్న పాప సన్ షేడ్ మీదకి జారి పడడం, ఆ తర్వాత ఆ పాపని కాపాడడం వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ పాప వయసు 8 నెలలు. ఆమె తల్లి పేరు రమ్య. ఆమెకి 33 సంవత్సరాలు. రమ్య భర్త పేరు వెంకటేష్. వీరిద్దరూ కలిసి చెన్నైలో ఉన్న తిరుముల్లైవాయల్‌లోని అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో నాలుగో అంతస్తు లో ఉంటారు. వీరిద్దరికి ఒక బాబు, ఒక పాప ఉన్నారు. బాబు వయసు నాలుగు సంవత్సరాలు.

Video Advertisement

ramya incident at coimbatore

ఈ సంఘటన రమ్యని చాలా బాధ పెట్టింది. అందరూ రమ్యని, “పిల్లని చూసుకోవడం చేతకాదా?” తిట్టడం మొదలుపెట్టారు. ఈ సంఘటన జరిగిన తర్వాత వెంకటేష్, రమ్య కోయంబత్తూర్ లోని కరమడైలో ఉన్న రమ్య తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయారు. ఈ సంఘటన తర్వాత రమ్య చాలా బాధలోకి వెళ్లిపోయారు. అంతమంది తనని మాటలు అనడం తట్టుకోలేకపోయారు. దాంతో రమ్య తన ప్రాణాలను విడిచారు. తల్లిదండ్రులు ఒకసారి రమ్యని ఇంట్లోనే వదిలేసి ఫంక్షన్ కి వెళ్లారు. వచ్చేటప్పటికి రమ్య అపస్మారక స్థితిలో ఉన్నారు. ఆ తర్వాత రమ్యని వారు హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అయినా కూడా ఫలితం లేదు. సోషల్ మీడియా మనిషి మీద ఎంత ప్రభావం చూపుతుంది అన్న దానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ.

సోషల్ మీడియాలో మనుషులు కనిపించరు. కాబట్టి ఎవరికి ఏది ఇష్టం వస్తే అది మాట్లాడుతారు. అవతల వారికి అది ఇబ్బంది కలుగుతుందా లేదా అని కూడా ఆలోచించరు. సాధారణంగానే సోషల్ మీడియాలో చిన్న విషయాలు మీద కూడా ట్రోలింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి విషయాలు జరిగినప్పుడు వాటి మీద ఇంకా ఎక్కువగా కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఆ కామెంట్స్ కూడా సాధారణంగా కాకుండా ఏదో తమ సొంత వారి తిట్టినట్టు ఇబ్బందికరమైన పదాలు వాడి మరి తిడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ విషయం తెలుసుకున్న వాళ్ళందరూ రమ్య పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.


End of Article

You may also like