మిహికాను పెళ్లికి ఒప్పించడం వెనక అసలు సీక్రెట్ బయటపెట్టిన రానా.! ఓ రోజంతా ఆలోచించి ఫోన్ చేశా!

మిహికాను పెళ్లికి ఒప్పించడం వెనక అసలు సీక్రెట్ బయటపెట్టిన రానా.! ఓ రోజంతా ఆలోచించి ఫోన్ చేశా!

by Megha Varna

Ads

ఒక్కసారిగా రానా దగ్గుబాటి హాట్ టాపిక్ గా మారారు.తాను ఎస్ చెప్పింది అంటూ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసినప్పటి నుండి అందరిలో ఈ ఆసక్తి మొదలైంది.రానా ఇప్పుడు మిహిక బజాజ్ అనే అమ్మాయి ని పెళ్లి చేసుకోబుతున్నాడు.మొన్ననే రోక ఫంక్షన్ జరిగింది.అందరూ ఇదేమి ఫంక్షన్ అబ్బా ఎప్పుడూ వినలేదే అని గూగుల్ లో సెర్చ్ చేసి ఆ ఫంక్షన్ గురించి తెలుసుకున్నారు.ఇంతకీ రోక ఫంక్షన్ అంటే పెళ్లి ఎప్పుడు,ఎంగేజ్మెంట్ ఎప్పుడు అని ఇతర విషయాలను మాట్లాడుకోవడానికి పెట్టుకొనే ఒక మీటింగ్.అయితే రానా శుక్రవారం లాక్ డౌన్ విత్ లక్ష్మి అనే పేరుతో మంచి లక్ష్మి తో లైవ్ చాట్ చేసారు.ఇందులో రానా ,మిహిక ప్రేమ వ్యవహారం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు..వివరాల్లోకి వెళ్తే….

Video Advertisement

మిహిక బజాజ్ ఒక ఈవెంట్ మేనేజర్.దేశంలోనే పేరుగాంచిన ఈవెంట్ మేనేజర్ తాను అని రానా తెలిపారు.హీరో వెంకటేష్ కూతురు ఆశ్రీత ద్వారా మిహిక రానా కు పరిచయం అయ్యిందంట.అయితే మిహిక నాకు చాలాకాలం నుండి తెలిసిన మా మధ్య ప్రేమ మాత్రం తాజాగా లాక్ డౌన్ కు ముందే మొదలైంది అని చెప్పారు రానా.

చూడగానే ప్రేమ పుట్టడం మనకి నచ్చిన వారు పక్కన ఉంటె మనకు తెలిసిపోవడం అలాంటిది ఏమైనా తెలిసిందా అని మంచు లక్ష్మి అడుగగా అవును నాకు ఆ ఫీలింగ్ తెలిసింది అని రానా తెలిపారు.మిహిక మా కుటుంబ సభ్యులందరితోను మంచి సత్సంబంధాలు ఉన్నాయ్ కావున తనను మా ఇంట్లో పరిచయం చెయ్యాల్సిన అవసరం లేకపోయింది అని రానా తెలిపారు.

లాక్ డౌన్ లో చాలా బోర్ ఫీల్ అయ్యాను నటించడానికి లేదు బయటకి వెళ్ళడానికి లేదు కాబట్టి సినిమాలు బాగా చూసాను.అదే సమయంలో మిహిక తో ఎక్కువగా ఫోన్ మాట్లాడేవాడిని ఆ విధంగా మా మధ్య రిలేషన్ మొదలైంది అని రానా తెలిపారు.అసలు మీ మధ్య ప్రేమ ఎలా మొదలైంది అని మంచు లక్ష్మి అడిగారు.మంచి విషయాలు జీవితంలో జరుగుతున్నప్పుడు వాటిని ఫాలో అయిపోతూ వెళ్ళాలి గాని ఎందుకు ఏంటి ఎలా అని ప్రశ్నలు వెయ్యకూడదు అని రానా అభిప్రాయపడ్డారు.తనకి ప్రేమ ను ప్రొపోజ్ చెయ్యడానికి ఒక రాత్రి అంతా నిద్ర పోకుండా ఆలోచించాను.

తర్వాత ఆ విషయాన్నీ ఫోన్ లో తెలియపరిచాను అప్పుడు ఆమె సమాధానం ఫోన్ లో చెప్పకుండా డైరెక్ట్ గా మీట్ అయ్యి ఎస్ చెప్పింది అని తెలిపారు రానా.అందుకే అంతా హ్యాపీ ఫీల్ అయ్యాను అని రానా అన్నారు.మిహిక విషయంపై మా కుటుంబ సభ్యులందరు కూడా షాక్ తో కూడిన ఆనందాన్ని వ్యక్తం చేసారు అని రానా తెలిపారు.


End of Article

You may also like