Ads
- కరోనా దెబ్బ ముందుగా అనుకున్న ఫంక్షన్స్ అన్నీ దాదాపు అటకెక్కేసాయి.రానా పెళ్లి కూడా ఇలాగే
అటకెక్కేసిందేమో అని అందరూ అనుకుంటున్న టైంలో రానా ప్రేయసి మిహికా బజాజ్ తాజాగా ఒక బాంబ్ పెలిచింది.
Video Advertisement
దగ్గుబాటి ఇంట చాలా కాలం తరువాత శుభకార్యం జరుగుతుంది.దానితో సురేష్ బాబు ఈ శుభకార్యాన్ని గ్రాండ్ గా చేయాలని నిర్ణయించుకున్నాడు.కాని ఆయన ఆశల మీద కరోనా నీళ్లు జల్లింది.దానితో రానా పెళ్లి ఇక ఈ సంవత్సరం జరగడం కష్టమని అందరూ ఫిక్స్ అయిపోయారు.కాని రానా ప్రేయసి మిహికా బజాజ్ తమ వివాహం ముందుగా అనుకున్నట్టు ఆగస్ట్ లోనే జరగబోతుందని ఒక ఫోటో తో అందరికీ క్లారిటీ ఇచ్చేసింది.
దీనితో దగ్గుబాటి అభిమానులు అసలు ఈ పెళ్లి ఎక్కడ జరుగుతుంది?సురేష్ బాబుకు ఆత్మీయులు ఎక్కువగా ఉన్న బాలీవుడ్,కోలీవుడ్ నుండి ఎవరు వస్తున్నారు అనే అంశాల పై తెగా ఆరా తీస్తున్నారు.ప్రస్తుతం ఉన్న సమాచారం మేర రానా పెళ్లి వేదిక కోసం సురేష్ బాబు ఫలక్ నుమా ప్యాలెస్ ను బుక్ చేశారట.ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు పాటిస్తూ అందుబాటులో ఉన్నవారిని పెళ్లికి ఆహ్వానించాలని సురేష్ బాబు భావిస్తున్నారని సమాచారం.
రెండు కుటుంబాలు ముందుగా అనుకున్న ముహర్తానికి రానా పెళ్లి చేసుకోవడం ద్వారా కరోనా టైంలో పెళ్లి చేసుకున్న తన తోటి హీరోలైన నిఖిల్,నితిన్ లకు తోడుగా నిలిచిన వాడవుతాడు.
End of Article