Ads
- చిత్రం : బ్రహ్మాస్త్ర (బ్రహ్మాస్త్రం)
- నటీనటులు : రణబీర్ కపూర్, ఆలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున.
- నిర్మాత : కరణ్ జోహార్
- దర్శకత్వం : అయాన్ ముఖర్జీ
- సంగీతం : ప్రీతమ్ చక్రబోర్తి
- విడుదల తేదీ : సెప్టెంబర్ 9, 2022
Video Advertisement
స్టోరీ :
కథ అంతా బ్రహ్మాస్త్రంకి చెందిన మూడు భాగాల చుట్టూ తిరుగుతుంది. అందులో ఒక భాగాన్ని అనీష్ శెట్టి (నాగార్జున) సంరక్షిస్తూ ఉంటాడు. మరొక భాగాన్ని సైంటిస్ట్ మోహన్ భార్గవ్ (షారుక్ ఖాన్) తీసుకుంటాడు. ఆ మూడు భాగాల్ని చేర్చి శక్తి పొందాలి అని జూనూన్ (మౌని రాయ్) బృందం ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ప్రతి సారి వాళ్ళు అనుకున్న ఫలితాలను పొందరు. ఇంక మూడవ భాగం డీజే శివ (రణబీర్ కపూర్) దగ్గర ఉంటుంది. శివ ఈషా (ఆలియా భట్) తో ప్రేమలో పడతాడు. తర్వాత కథ ఏంటి? తన దగ్గర ఉన్న అస్త్రాన్ని శివ కాపాడగలిగాడా? ఈ క్రమంలో శివ ఎలాంటి సంఘటనలను ఎదుర్కొన్నాడు? శివ ప్రేమ కథ ఎలా ముందుకు వెళుతుంది? ఇదంతా తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
రణబీర్ కపూర్ డైరెక్ట్ తెలుగు సినిమా చేయకపోయినా కూడా చాలా మంది తెలుగు ప్రజలకు సుపరిచితులైన నటుడు. ఇది రణబీర్ కపూర్ రెండవ పాన్-ఇండియన్ సినిమా. అంతకు ముందు విడుదల అయిన షంషేరా సినిమా కూడా తెలుగులో విడుదల అయ్యింది. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని పొందలేదు. ఈ సినిమా గత సంవత్సరం విడుదల కావాల్సి ఉన్నా కూడా చాలా కారణాల వల్ల ఇప్పుడు విడుదల అయ్యింది. లేకపోతే ఇది రణబీర్ కపూర్ మొదటి పాన్-ఇండియన్ సినిమా అయ్యేది. సినిమా విషయానికి వస్తే ట్రైలర్ లో చూపించినట్టుగానే సినిమా ఒక సోషియో ఫాంటసీ కథగా అనిపిస్తుంది.
ఇప్పటి కాలానికి తగ్గట్టు సినిమా ఉన్నా కూడా, చాలా మైథలాజికల్ విషయాలని ఇందులో చూపించారు. ఇంక పర్ఫామెన్స్ విషయానికి వస్తే సినిమా మొత్తాన్ని తన భుజాలపై నడిపించారు రణబీర్ కపూర్. రణబీర్ కపూర్ ఎంత గొప్ప నటుడు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో నటన మాత్రమే కాకుండా యాక్షన్ సీక్వెన్స్ లలో కూడా చాలా కష్టపడ్డారు అని తెలుస్తోంది. అలాగే నాగార్జున, అమితాబ్ బచ్చన్ పాత్రలు కూడా కథ ముందుకు నడిపించడానికి సహాయం చేసేలాగా ఉన్నాయి.
ఇంక నెగిటివ్ పాత్ర పోషించిన మౌని రాయ్ సినిమాకి మరో హైలైట్. మౌని రాయ్ నాగిని సీరియల్ తో తెలుగు వాళ్లకి కూడా పరిచయం అయ్యారు. ఈ సినిమాలో ఒక మంచి పాత్ర పోషించారు. ఆలియా భట్ నటన బాగుంది. టెక్నికల్ గా సినిమా చాలా బలంగా ఉంది. యాక్షన్ సీన్స్, అస్త్రాలని చూపించడం ఇంకా చాలా సీన్స్ లో గ్రాఫిక్స్ చాలా బాగా డిజైన్ చేశారు. పాటలు వినడానికి మాత్రమే కాకుండా చూడటానికి కూడా చాలా బాగున్నాయి. కానీ కథ విషయంలో మాత్రం ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుండేది అనిపిస్తుంది. కథ కొత్తగా ఉంది. దర్శకుడు అయాన్ ముఖర్జీ పడిన కష్టం తెరపై కనిపిస్తోంది. కానీ చాలా చోట్ల సినిమా సాగదీసినట్టు అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- రణబీర్ కపూర్- ఆలియా భట్ కెమిస్ట్రీ
- నటీనటుల పెర్ఫార్మెన్స్
- గ్రాఫిక్స్
- యాక్షన్ సీన్స్
- పాటలు
మైనస్ పాయింట్స్:
- సాగదీసినట్టుగా ఉండే కొన్ని సీన్స్
- స్లోగా నడిచే స్క్రీన్ ప్లే
రేటింగ్ :
3.25/5
ట్యాగ్ లైన్ :
ఈ సినిమాపై ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా నెగిటివిటీ ఉంది. కానీ అదంతా పక్కనపెట్టి సినిమా చూడడానికి వెళ్తే మాత్రం సినిమా ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. సోషియో ఫాంటసీ అంశాలు ఉన్న సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులని బ్రహ్మాస్త్ర కచ్చితంగా నిరాశ పరచదు.
End of Article