Ads
భారతదేశంలో సంస్కృతికి పెద్ద పీట వేస్తారు అనే సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. భారతదేశమంటే ముందుగా గుర్తొచ్చేది ఇక్కడ సంస్కృతి, సాంప్రదాయాలు. భారతదేశం అంటే ఆలయాలకు కూడా ప్రసిద్ధి. ఎన్నో ఆలయాలు ఇక్కడ ఉన్నాయి.
Video Advertisement
విదేశాల నుండి ఎంతో మంది ఈ ఆలయాలకి వచ్చి దేవుడిని దర్శించుకొని వెళ్తారు. ఇంక పండగల సమయంలో అయితే ఆలయాల రద్దీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అలాంటి ప్రత్యేక రోజుల్లో దేవుడిని దర్శించుకోవడానికి ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు. అయితే, ఆలయాల్లో దేవుడిని దర్శించుకునే ముందు పూజలకి డబ్బులు కట్టాలి. టికెట్ తీసుకోవాలి.
ఇలా దేవుడు దర్శనానికి కొంత మొత్తాన్ని చెల్లించాలి. కానీ చర్చికి, దర్గాకి వెళ్తే అక్కడ ఒక రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదు. దీనికి కారణం ఏంటి అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఇదే విషయాన్ని బీజేపీ స్పోక్స్ పర్సన్ అయిన రాణి రుద్రమని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సిగ్నేచర్ స్టూడియోస్ అనే ఒక ఛానల్ యాంకర్ అడిగారు. ఈ విషయం మీద రాణి రుద్రమ తనదైన శైలిలో జవాబు ఇచ్చారు. ముందుగా యాంకర్ అడిగిన ప్రశ్న సరైనది అని అన్నారు.
తర్వాత ఈ విషయం మీద రాణి రుద్రమ మాట్లాడారు. ఇటీవల కరీంనగర్ లో బండి సంజయ్ గారు కట్టించిన మహాశక్తి ఆలయానికి వెళ్లారు అని, అక్కడ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం రాలేదు అని అన్నారు. ఇందుకు కారణం ఏంటి అని బండి సంజయ్ ని అడగగా, “మేము అలాంటి పద్ధతులకు వ్యతిరేకం” అని చెప్పారు. ప్రభుత్వం కొంత మొత్తాన్ని గుళ్ళ డెవలప్మెంట్ కి ఇవ్వాలి అని అన్నారు.
డెవలప్మెంట్ కోసం ఇదంతా కమర్షియల్ అయిపోయింది కానీ, ఇదంతా ప్రభుత్వం చూసుకోవాలి అని ఈ విషయం మీద వివరంగా చెప్పారు రాణి రుద్రమ. ఇది మాత్రమే కాకుండా, ఆడపిల్లల మీద ఎలాంటి అన్యాయం జరిగినా కూడా వెంటనే స్పందించాలి అని అన్నారు. ఇటీవల జరిగిన ఒక సంఘటన గురించి మాట్లాడుతూ, బీజేపీ ఇలాంటి వాటికి తొందరగా స్పందిస్తుంది అని, అలా ప్రతి ఒక్క పార్టీ కూడా ఇలాంటి సమస్యల మీద వెంటనే స్పందించాలి అని అభిప్రాయపడ్డారు.
watch video :
End of Article