హీరోగా మారిన సీనియర్ కేరక్టర్ ఆర్టిస్ట్…షూటింగ్ కూడా అయిపోయింది…!

హీరోగా మారిన సీనియర్ కేరక్టర్ ఆర్టిస్ట్…షూటింగ్ కూడా అయిపోయింది…!

by Mounika Singaluri

Ads

సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం కంటెంట్ బేస్డ్ సినిమాలకి మంచి రోజులు నడుస్తున్నాయి. హీరో ప్రధానంగా కాకుండా కథ ప్రధానంగా వచ్చే సినిమాలకి ప్రేక్షకులు బ్రహ్మ రథం పడుతున్నారు. తెలుగులో చాలామంది సీనియర్ నటులు హీరోలుగా మారి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇందులో కొంతమంది సక్సెస్ అయితే కొంతమంది ఫెల్యూర్ అయ్యారు.

Video Advertisement

అయితే ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టు రావు రమేష్ విలన్ గా, తండ్రిగా, కమెడియన్ గా చాలా చిత్రాలలో నటించారు. అయితే ఆయన మొదటిసారి హీరోగా మారి చేసిన చిత్రం తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది. హ్యాపీ వెడ్డింగ్ చిత్రాన్ని తలకెక్కించిన దర్శకుడు లక్ష్మణ్ కార్య రావు రమేష్ తో మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మూవీనీ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు మూవీ టీం ప్రకటించింది. ఆయనకు జోడిగా సీనియర్ ఆర్టిస్ట్ ఇంద్రజ నటించారు. ఎటువంటి బ్రేకులు లేకుండా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసినట్లుగా దర్శకుడు ప్రకటించారు. రావు రమేష్ తమకు ఎంతగానో సహకరించాలని తెలిపారు. అతి త్వరలోనే ఈ మూవీని ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు.


End of Article

You may also like