తమిళ్ స్టార్ హీరో… “చియాన్ విక్రమ్” కి అరుదైన గౌరవం..!

తమిళ్ స్టార్ హీరో… “చియాన్ విక్రమ్” కి అరుదైన గౌరవం..!

by Mohana Priya

Ads

మనం సినిమా నచ్చితే ఏ భాషలో అయినా సరే ఒకేలాగా ఆదరిస్తాం. అందుకే మన భాషలోని సినిమాలు వేరే భాషల్లోకి, వేరే భాషల సినిమాలు మన భాషలోకి డబ్ చేస్తూ ఉంటారు. తెలుగులోకి డబ్ అయ్యే సినిమాలు ఎక్కువగా తమిళ్ భాష నుంచి అవుతాయి.

Video Advertisement

అలా తమిళ సినిమాల్లో నటిస్తూ, అవి తెలుగులో కూడా డబ్ చేస్తూ తెలుగులో కూడా స్టార్ హీరో అనే గుర్తింపు సంపాదించుకున్న నటుడు చియాన్ విక్రమ్. విక్రమ్ నటించిన అన్ని సినిమాలు తెలుగులో కచ్చితంగా డబ్ అవుతాయి. ఇటీవల విక్రమ్ హీరోగా నటించిన కోబ్రా, పొన్నియన్ సెల్వన్ సినిమాలు కూడా తెలుగులో డబ్ అయ్యాయి.

vikram

అయితే విక్రమ్ కి ఇప్పుడు ఒక అరుదైన గౌరవం లభించింది. విక్రమ్ కి గోల్డెన్ వీసా లభించింది. దుబాయ్ ప్రభుత్వం విక్రమ్ కి గోల్డెన్ వీసా అందించింది. పూర్ణ తన భర్తతో కలిసి విక్రమ్ కి ఈ దుబాయ్ గోల్డెన్ వీసా అందించారు. ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతకు ముందు కూడా కొంత మంది భారతీయ నటీనటులకు దుబాయ్ గోల్డెన్ వీసా వచ్చింది. వారిలో ప్రముఖ నటుడు మోహన్ లాల్, మమ్ముట్టి, కమల్ హాసన్, త్రిష, కాజల్, షారుఖ్ ఖాన్ కూడా ఉన్నారు. ఇప్పుడు విక్రమ్ కూడా ఈ జాబితాలో చేరారు. ప్రస్తుతం విక్రమ్ తంగలాన్ అనే సినిమా పనిలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల చేశారు.


End of Article

You may also like