ప్రస్తుతం మన తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా ఎప్పుడు ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్న సినిమాల్లో ముఖ్యమైన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ఈ అక్టోబర్ లో విడుదల అవ్వబోతోంది అనే వార్తలు వచ్చాయి. సినిమా బృందం కూడా ఇది నిజం అని అధికారికంగా ప్రకటించారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే అక్టోబర్ లో విడుదల అవుతుందా? లేదా? అనే సందేహం నెలకొంది. అయితే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాతో పాటు ఆచార్య సినిమా షూటింగ్ లో కూడా పాల్గొన్న విషయం అందరికీ తెలిసిందే.ram charan

ఆచార్య లో సిద్ధ అనే పాత్రలో నటిస్తున్నారు రామ్ చరణ్. అయితే ఈ జనరేషన్ హీరోల్లో ఎవరికీ లేని ఒక అరుదైన రికార్డ్ రామ్ చరణ్ సొంతం చేసుకున్నారు. అదేంటంటే, రామ్ చరణ్ తన తండ్రితో కలసి ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. ఇది ఈ జనరేషన్ హీరోల్లో కొంత మంది చేశారు. అయితే, ఈ సినిమాని తానే నిర్మిస్తున్నారు కూడా. ఇది మాత్రం ఈ జనరేషన్ హీరోల్లో ఇప్పటివరకు ఎవరు చేయలేదు. అంతకు ముందు జనరేషన్ హీరోలలో అక్కినేని నాగార్జున, హరికృష్ణ గారికి ఈ రికార్డ్ ఉంది. నాగార్జున అయితే తన తండ్రితో పాటు, తన కొడుకుల సినిమాలను కూడా నిర్మించారు. ఈ జనరేషన్ లో అలా తన తండ్రితో సినిమాను నిర్మించి అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నారు రామ్ చరణ్.