Ads
తెలుగు ఇండస్ట్రీలో నాలుగు స్తంభాలు వంటి వారు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ. ఎన్నో సంవత్సరాల నుండి వీళ్లు సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్నారు. నాగార్జున అయితే ఎప్పటికప్పుడు కొత్త రకమైన సినిమాలని ప్రయత్నించడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎంతో మంది టాలెంటెడ్ నటులని, దర్శకులని ఇండస్ట్రీకి పరిచయం చేయడం మాత్రమే కాకుండా, తాను కూడా ట్రెండ్ కి తగ్గట్టుగా సినిమాలు తీయడానికి ప్రయత్నిస్తారు. వాటిలో కొన్ని హిట్ అయ్యాయి. కొన్ని ఫ్లాప్ అయ్యాయి. కొన్ని జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా తెచ్చుకున్నాయి.
Video Advertisement
సినిమా ఫలితం ఎలా ఉన్నా కానీ, నాగార్జున మాత్రం ప్రయోగాలు చేయడం ఎప్పుడూ ఆపలేదు. అలా నాగార్జున చేసిన ప్రయోగాల్లో ఒక సినిమా రక్షకుడు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందింది. సుస్మిత సేన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. కానీ పాటలు మాత్రం చాలా హిట్ అయ్యాయి. రక్షకుడు సినిమాకి ప్రవీణ్ గాంధీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదల అయ్యి ఇవాల్టికి 24 సంవత్సరాలు అయ్యింది. అయితే, మనం ఇప్పుడు థియేటర్లలో విడుదల అయిన సినిమాలు కొన్ని రోజుల తర్వాత డిజిటల్ రిలీజ్ అవ్వడం చూస్తూనే ఉంటాం.
కానీ రక్షకుడు మాత్రం రిలీజ్ అయిన మూడు రోజులకే టీవీలో టెలికాస్ట్ అయ్యింది. అక్టోబర్ 30వ తేదీన ఈ సినిమా విడుదల అయితే, నవంబర్ 2వ తేదీన జెమినీ టీవీలో, ఆ తర్వాత ఈ టీవీలో కూడా ప్రసారం అయ్యింది. రక్షకుడు అప్పట్లో 15 కోట్లు పెట్టి తీశారు. ఆ సమయంలో 15 కోట్లు అంటే హై బడ్జెట్ సినిమా అయినట్టే లెక్క. కానీ సినిమా విడుదల అయిన మూడు రోజులకే టీవీలో టెలికాస్ట్ చేశారు. అలా రక్షకుడు సినిమా ఒక అరుదైన రికార్డ్ సంపాదించింది.
End of Article