బాధ్యత ఉండక్కర్లేదా? అంటూ సోనమ్ పై రష్మీ ఫైర్.! కారణం ఆ చాక్లెట్ కేక్!

బాధ్యత ఉండక్కర్లేదా? అంటూ సోనమ్ పై రష్మీ ఫైర్.! కారణం ఆ చాక్లెట్ కేక్!

by Megha Varna

Ads

తెలుగులో ఎంత మంది ఫిమేల్ యాంకర్స్ ఉన్నా.. రష్మీ గౌతమ్ ప్రత్యేకం. అందం, అభినయంతో పాటు.. ఆకట్టుకునే మాటలు, హావభావాలు, కామెడీకి స్పందించే పద్దతి, తన మీద పంచ్ పడితే ముద్దుగా బుంగమూతి పెట్టే తీరూ.. కామెడీ లవర్స్‌కి సుపరిచతమే. ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో కమెడియన్స్ చేసే కామెడీతో పాటూ.. రష్మీ యాంకరింగ్‌కి కూడా చాలా క్రేజ్ ఉంది. అప్పుడప్పుడూ ఆ క్రేజ్‌ని కూడా కామెడీ చేసి నవ్వు పుట్టిస్తుంటారు కమెడియన్స్.జబర్దస్త్ అంటే రష్మీ అనేంతగా పేరు తెచ్చుకున్నారు రష్మీ ..

Video Advertisement

కాగా అనిల్ కపూర్ తనయురాలు సోనమ్ కపూర్ 2007 లో రణ్ బీర్ కపూర్ సరసన సావరియా చిత్రంతో బాలీవుడ్ కి పరిచయం అయ్యి తరవాత చాలా విజయవంతమైన చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు .ఈ నేపథ్యంలో యాంకర్ రష్మీ గౌతమ్ బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ పై సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయింది.

కరోనా వైరస్ వలన దేశమంతటా లాక్ డౌన్ విధించడంతో సెలబ్రెటీలు నుండి సామాన్య ప్రజల వరుకు అందరు ఇళ్లకే పరిమితమయ్యారు .నిత్యావసరాల కోసం మరియు అత్యవసర పరిస్థితులలో తప్ప ఎవరు బయటకి రావడం లేదు. సెలబ్రెటీలు కరోనా వైరస్ పై స్పందిస్తూ మరియు వారు ఈ లాక్ డౌన్ లో ఎలా గడుపుతున్నారనే దానిపై ట్వీట్ చేస్తున్నారు .

తాజాగా సోనమ్ ‘నేను ఓ చాకోలెట్ కేక్ చేశాను. నేను చేయాలనుకున్న టైమ్‌కి ఇంట్లో చాక్‌లెట్ లేకపోతే ఓ పుడ్ సప్లై సంస్థ నాకు చాలా క్వాలిటీ గల చాక్‌లెట్‌ను పంపింది. చాక్లెట్ పంపించి నాకు సహకరించిన వారికి ధ‌న్య‌వాదాలు.. లవ్యూ న్యూ ఢిల్లీ’ అంటూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసిన రష్మీ.. ‘సరిలేరు నీకెవ్వరు’లో మహేశ్ బాబు చెప్పిన ‘బాధ్యత ఉండక్కర్లా’ డైలాగుతో సోనమ్‌పై  ఫైర్ అయ్యింది .

సమాజంలో సెలబ్రెటీ అయితే చాలు …ఏదైనా చేయాలనిపిస్తుంది …తమ పలుకుబడి ఉపయోగించుకొని దేనినైనా తెచ్చుకోగలమని అనుకుంటారు .కాకపోతే కొంచెం బాధ్యతతో నడుచుకుంటే మంచిది . సెలబ్రెటీ ఇలా చాక్‌లెట్ డెలీవరీ కోసం ప్రజలను రోడ్లపైకి తీసుకురావడం ప్రస్తుత పరిస్థితులలో మంచిది కాదు. సామజిక దూరం పాటించి కరోనాను ఎదుర్కోవాల్సిన సమయం ఇది.ఇలా వ్యక్తిగత అవసరాల కోసం బాధ్యతను విస్మరించడం సరైన పద్ధతేనా అని ఒకసారి ఆలోచించాలి అంటూ సోనమ్ పై విరుచుకుపడింది రష్మీ గౌతమ్.

ప్రస్తుత పరిస్థితులలో మూగ జీవాలను పట్టించుకోవడం లేదు . వీధి కుక్కల పరిస్థితి దారుణంగా ఉంది అని చలించిపోయిన రష్మీ వాటికీ తానే స్వయంగా ఆహారం ,నీళ్లు అందిస్తుంది .అందరు కూడా దగ్గరలో ఉన్న మూగజీవాలకు ఆహారం అందించి వాటిపై ప్రేమను చూపి మానవత్వాన్ని చాటుకోవాలని అన్నారు .


End of Article

You may also like