రష్మీ ఎమోషనల్ కామెంట్స్…ఏం పాపం చేసిందని అంత దారుణంగా కొట్టారు?

రష్మీ ఎమోషనల్ కామెంట్స్…ఏం పాపం చేసిందని అంత దారుణంగా కొట్టారు?

by Sainath Gopi

జబర్దస్త్ అంటే రశ్మి, రశ్మి అంటే జబర్దస్త్ అన్నట్టుగా ఒక ప్రోగ్రామ్ ద్వారా యాంకర్ కి గుర్తింపు రావడం చిన్న విషయం కాదు. తెలుగు యాంకర్ గా రశ్మిది బుల్లితెరపై ప్రత్యేక స్థానం. అడపా దడపా తెలుగు సినిమాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటుంది . మరోవైపు సోషల్ మీడియాలో కడా యాక్టివ్ గా ఉంటూ సోషల్ ఇష్యూస్ పై తన వాయిస్ వినిపిస్తూ ఉంటుంది.

Video Advertisement

హోలీ పండుగ సంధర్బంగా  దయచేసి కుక్కలపై రంగులు వేయకండి. హోలీలో మనపై రంగులు పడితే వాటిని శుభ్రం చేసుకునేందుకు మనకు సబ్బులు ఉన్నాయి. కానీ  మూగజీవాలకి అలాంటివేవి ఉండవంటూ రష్మీ ట్వీట్ చేసింది.

హోలీ రోజు జరిగిన ఒక విషయం మీద రష్మీ ఎమోషనల్ గా ట్విట్ చేసింది,ఓ కుక్క పిల్లను ఎవరో కొట్టి పడేశారు. ఆ వీడియో రష్మీ తన ట్విట్టర్ ల్ పోస్ట్ చేసింది. ఈ కుక్క పిల్ల ఏ పాపం చేసింది. అంతలా ఆ గాయాలు చేశారు,మెడ పై కొట్టారు,అవి చూస్తే బాధ కలుగుతుంది. ఇది చేసిన వారు ఎవరో తెలిస్తే నాకు చెప్పండి, మూగజీవాల ప్రాణాల కోసం గలమెత్తమని భావోద్వేగంగా రష్మి గౌతమ్ పోస్టు పెట్టింది. కాగా ప్రస్తుతం రష్మీ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

అయితే రష్మీ చేసిన ఈ ట్వీట్ పైన ఓ నెటిజన్ స్పందిస్తూ “పండగలు, పబ్బాలు వచ్చినప్పుడే మీకు ఇలాంటివి గుర్తుకు వస్తుంటాయా ? అని కామెంట్ చేసింది.. దీనికి ప్రతిస్పందనగా రష్మీ  “నాపై ఇలాంటి కామెంట్లు పెట్టే ముందు ఒకసారి నేను గతంలో చేసిన పోస్టుల్ని, నా పేజ్‌ను చెక్ చేయండి” అంటూ కౌంటర్ కామెంట్ చేసింది.


You may also like

Leave a Comment