Home Filmy Adda Bomma Blockbuster Review: “నందు, రష్మీ గౌతమ్” నటించిన బొమ్మ బ్లాక్‌బస్టర్ హిట్టా..? ఫట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Bomma Blockbuster Review: “నందు, రష్మీ గౌతమ్” నటించిన బొమ్మ బ్లాక్‌బస్టర్ హిట్టా..? ఫట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Megha Varna

Ads

  • చిత్రం : బొమ్మ బ్లాక్ బస్టర్
  • నటీనటులు : నందు విజయ్ కృష్ణ, రష్మీ గౌతమ్, కిరీటి దామరాజు, రఘు కుంచె.
  • నిర్మాత : ప్రవీణ్ పగడాల, బోసు బాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి ఈడ (విజయీభవ ఆర్ట్స్)
  • దర్శకత్వం : రాజ్ విరాట్
  • సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి
  • విడుదల తేదీ : నవంబర్ 4, 2022

Video Advertisement

స్టోరీ :

నందు పోతురాజు పాత్ర చేశాడు. పోతురాజు ఒక మత్స్యకారుడు అలానే పూరి జగన్నాథ్ కి పెద్ద ఫ్యాన్. తన గతంలోని ఉండే క్షణాలని ఒక స్టోరీ కింద రాసి సినిమా తీయాలని అనుకుంటూ ఉంటాడు. పూరి జగన్నాథ్ ని ఒప్పించడం అతని జీవిత ఆశయం. కానీ తెలివి తక్కువ పనులు వలన తీవ్ర వేదనని ఎదుర్కోవాల్సి వస్తుంది. హీరో ఎలా సక్సెస్ అయ్యాడు అనేది ఈ సినిమా. అలానే రష్మీ తనకి ఎలా పరిచయం అవుతుంది అనేవే ఈ సినిమా స్టోరీ. నందు విజయ్ కృష్ణ, రష్మీ గౌతమ్, కిరీటి దామరాజు, రఘు కుంచె ఈ సినిమాలో నటించారు.

రివ్యూ :

నటుడిగా నందు ఎన్నో సినిమాల్లో నటించారు. అలాగే రష్మీ గౌతమ్ కూడా జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో ఎంతో పేరు సంపాదించారు. రష్మీ కొన్ని సినిమాల్లో కూడా నటించారు. ఇప్పుడు ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. పోతురాజు పాత్రని నందు బాగా చేశాడు. ఈ సినిమాలో పోతురాజు పాత్ర బాగుంటుంది. రష్మీ గౌతమ్ పాత్ర కూడా పరవాలేదు అనిపించింది. కానీ పెద్దగా స్కోప్ అయితే లేదు. కానీ ముఖ్యపాత్ర మాత్రం చాలా బాగుంది సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. దర్శకత్వం చాలా అద్భుతంగా ఉంది.

ఈ సినిమాలో రెండవ భాగం చాలా నెమ్మదిగా కదులుతుంది. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ రెండో భాగం లో చూపిస్తారు. రష్మి గౌతమ్ పాత్ర పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. కిరీటి రఘు కుంచె, నందు పర్ఫామెన్స్ అయితే బాగా ఆకట్టుకుంది మొత్తంగా చూసుకున్నట్లయితే బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా ఎంటర్టైన్మెంట్ చేసేలాగే ఉంది.

ప్లస్ పాయింట్స్ :

  • నటీ నటులు
  • దర్శకత్వం
  • స్క్రీన్ ప్లే

మైనస్ పాయింట్స్:

  • కొన్ని సన్నివేశాలు

రేటింగ్ :

3.25/5

ట్యాగ్ లైన్ :

బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాని ఒకసారి చూడొచ్చు. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాల కి ఏ మాత్రం తక్కువగా ఉంటుంది డిసప్పాయింట్ అయితే సినిమా చేయదు. ఒకసారి చూడచ్చు.

watch trailer:


End of Article

You may also like