ప్రతి గురువారం, శుక్రవారం మనల్నందరిని అలరిస్తున్న ప్రోగ్రామ్స్ జబర్దస్త్ ఇంకా ఎక్స్ట్రా జబర్దస్త్. ఈ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి మెల్లమెల్లగా జనాల్లోకి స్ప్రెడ్ అవుతూ, ఇప్పుడు టాప్ షోస్ గా నిలిచాయి.ఈ రెండు ప్రోగ్రామ్స్ ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు మన ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఒక రోజు జబర్దస్త్ లో అనసూయ యాంకర్ గా మనల్ని అలరిస్తుంటే, మరొక రోజు ఎక్స్ట్రా జబర్దస్త్ లో రష్మీ యాంకర్ గా మనల్ని ఎంటర్టైన్ చేస్తారు.

 

రష్మీ శుక్రవారం ప్రసారమయ్యే ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోగ్రామ్ కి యాంకర్ గా వ్యవహరిస్తారు. రష్మీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. అయితే, రష్మీ ఇటీవల ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ఇంస్టాగ్రామ్ స్టోరీలో షి ద పీపుల్ టీవీ వారు పోస్ట్ చేసిన సింగిల్ పేరెంట్స్ గురించి ఒక పిక్చర్ షేర్ చేసి కింద ఈ విధంగా రాశారు రష్మీ.

rashmi gautam instagram story

“నేను ఇలాంటి ఒక కూతురిని. నాకు ఆ కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు. నేను ఇప్పుడు ఆలోచనా విధానం మారింది అని అనుకుంటున్నాను. అలాగే మన సమాజాన్ని భవిష్యత్తులో మంచిగా మార్చేది పిల్లలే కాబట్టి, తల్లిదండ్రులు కూడా తమ పిల్లలని ఉన్నత విలువలతో పెంచుతారు అని ఆశిస్తున్నాను” అని రాసారు రష్మీ గౌతమ్.