Home Filmy Adda RASHMIKA EMOTIONAL POST: “రష్మిక” ఎమోషనల్ పోస్ట్..అందులో ఏముందంటే.?

RASHMIKA EMOTIONAL POST: “రష్మిక” ఎమోషనల్ పోస్ట్..అందులో ఏముందంటే.?

by Sainath Gopi

పుష్ప 2 సినిమాతో నేషనల్ క్రష్ గా మారిన రష్మిక తన సినీ ప్రయాణంలో ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియాలో తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. కన్నడ కిర్రాక్ పార్టీతో హీరోయిన్ గా మొదలుపెట్టిన రష్మిక చలో సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోలు సరసన అవకాశాలు దక్కించుకుంది.

https://www.instagram.com/p/C1b–YAowur/

ఇటు తెలుగులోనే కాకుండా అన్ని సౌత్ లాంగ్వేజెస్ లో కూడా టాప్ పొజిషన్ ని అందుకుంది రష్మిక. ఇటీవల యానిమల్ తో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకొని బాలీవుడ్ లో కూడా పాగా వేసింది రష్మిక. పాత్ర ఏదైనా పరకాయి ప్రవేశం చేసి మెప్పించడం ఆమె నైజం. అలాంటి నేషనల్ క్రష్మిక సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఏడు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంటూ ఈ విధంగా చెప్పుకొచ్చింది రష్మిక.

నా ఈ సినీ ప్రయాణంలో కొన్నిసార్లు వెనక్కి తిరిగి చూసుకుంటే ఇదంతా ఎప్పుడు, ఎలా జరిగింది అనిపిస్తుంది. సినిమా రంగంలోకి రావడం ఆనందంగానూ గర్వంగానూ
ఉంది. ఈ జీవితం కోసమే ఎన్నో కలలు కన్నాను ఇండస్ట్రీకి పరిచయం లేని సమయంలో సినిమా రంగంలోకి వచ్చాను మంచి జీవితం కోసం పరుగులు తీస్తూనే ఉన్నాను. సరియైన వ్యక్తులు తోడుగా ఉండటం వల్ల ఆలోచించి అడుగులు వేయగలుగుతున్నాను.

కలలు కంటూ పెరిగిన నేను ఇప్పుడు సంతోషంగా ప్రశాంతంగా ఉన్నాను లిటిల్ గర్ల్ తన కలల కోసం ఇలా ఎదిగింది అంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది రష్మిక. ప్రస్తుతం ఈమె పుష్ప 2, సినిమాలోనూ అలాగే గర్ల్ ఫ్రెండ్, ఛావా,రెయిన్ భో చిత్రాల్లో నటిస్తుంది. ఏదైనా ఇండస్ట్రీ గురించి ఏమీ తెలియని ఒక అమ్మాయి ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా ఎదగటం అంటే మెచ్చుకోవాల్సిన విషయమే.

You may also like