Home Filmy Adda Rashmika Mandanna : హాట్ టాపిక్ గా మారిన రష్మిక ఇంస్టాగ్రామ్ స్టోరీ..! కారణమేంటంటే..?

Rashmika Mandanna : హాట్ టాపిక్ గా మారిన రష్మిక ఇంస్టాగ్రామ్ స్టోరీ..! కారణమేంటంటే..?

by Mohana Priya

ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న హీరోయిన్స్ లో బిజీగా ఉన్న హీరోయిన్లలో ఒకరు రష్మిక మందన్న. తెలుగులో మాత్రమే కాకుండా, హిందీ, తమిళ్ భాషల్లో కూడా రష్మిక సినిమాలు చేస్తున్నారు. రష్మిక ప్రస్తుతం తెలుగులో ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తుండగా, కిషోర్ తిరుమల దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. అంతే కాకుండా హిందీలో కూడా రెండు సినిమాల్లో రష్మిక హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇవన్నీ మాత్రమే కాకుండా, పుష్ప సినిమాలో శ్రీవల్లిగా ఒక డిఫరెంట్ పాత్రతో అలరించబోతున్నారు రష్మిక.

రష్మిక ఇవాళ షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ప్రస్తుతం చర్చలకి దారి తీసింది. ఇందులో రష్మిక ఎక్కడికో వెళుతున్నట్టు తన పాస్‌పోర్ట్ ది ఫోటో అప్‌లోడ్ చేసారు. ఇందులో రష్మిక పేరు ముండచాదిరా అని ఉంది. రష్మిక తండ్రి పేరు మదన్ మందన్న ముండచాదిరా. రష్మిక కూర్గ్ లోని కొడగుకి చెందిన వారు. దాంతో “రష్మికకి, కొడగు రాజ వంశస్థులకి ఏమైనా సంబంధం ఉందా?” అనే వార్తలు మొదలయ్యాయి. కొడగు వర్గానికి చెందిన వాళ్ళు ఎన్నో యుధాల్లో కూడా పోరాడారు. ఇలా కొంత మంది నెటిజన్లు అభిప్రాయపడుతుంటే, మరి కొంతమంది “అది కేవలం ఒక సర్ నేమ్ మాత్రమే. దాని గురించి ఇంత చర్చ చేయడం కరెక్ట్ కాదు” అని అన్నారు.

You may also like