Home Filmy Adda Rashmika Mandanna : రష్మిక టాటూ వెనుక వున్న రహస్యం ఇదే…!!

Rashmika Mandanna : రష్మిక టాటూ వెనుక వున్న రహస్యం ఇదే…!!

by Megha Varna

కేవలం టాలీవుడ్ సినిమాలు మాత్రమే కాకుండా శాండిల్వుడ్, టాలీవుడ్, బాలీవుడ్ లో కూడా నటించి పాపులర్ అయింది రష్మిక. అయితే ఈ బ్యూటీ టాటూ వెనుక ఉన్న సీక్రెట్ ని తాజాగా రివీల్ చేసింది. అయితే రష్మిక టాటూ వెనక ఉన్న రహస్యం ఏమిటంటే..? రష్మిక ఎడమ చేతి మీద ఇంగ్లీష్ లో ఉన్న ”irreplacable” అని రాయించుకుంది. అయితే దాని అర్థం ఏమిటో రష్మిక తెలియజేసింది.

ఆమెను ఎవరూ రెప్లకబుల్ చెయ్యలేరని.. తన కళ్ళని కానీ, తన ఫేస్ ని కానీ.. యాక్టర్ గా తనని కానీ ఎవరూ రిప్లేకబుల్ చేయలేరనే అలా టాటూని వేయించుకున్నానని అంది. అలానే దాని అర్థం కూడా అదేనని రష్మిక బయటపెట్టింది. ఈ విషయాన్ని ఆమె మాత్రమే కాదని ఆమె ఫ్రెండ్స్ కూడా నమ్ముతారు అని చెప్పింది రష్మిక. ప్రస్తుతం రష్మిక పుష్ప సినిమాలో అల్లు అర్జున్ సరసన నటిస్తోంది.

రష్మిక తో నటించే సమయంలో అల్లు అర్జున్ “నీవు నీ ట్యాలెంట్ వల్ల ఇక్కడికి వచ్చావని” చెప్పారని అంది. మొదట్లో నేను భయపడితే భయపడాల్సిన అవసరం లేదని అల్లు అర్జున్ ధైర్యం చెప్పారని.. ధైర్యంగా ముందుకు వెళ్లాలని అన్నారని రష్మిక చెప్పింది. అదే విధంగా అల్లు అర్జున్ మాస్ లుక్ లో ఈ సినిమాలో అదరగొట్టారని ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని ఆమె తెలిపింది.

You may also like