Ads
ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న హీరోయిన్స్ లో బిజీగా ఉన్న హీరోయిన్లలో ఒకరు రష్మిక మందన్న. తెలుగులో మాత్రమే కాకుండా హిందీ తమిళ్ భాషల్లో కూడా రష్మిక సినిమాలు చేస్తున్నారు. అయితే రష్మిక ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో భాగంగా రిలేషన్ షిప్ కి సంబంధించిన విషయాల గురించి మాట్లాడారు రష్మిక.
Video Advertisement
ఇందులో రష్మికని “మీ కంటే చిన్న వ్యక్తిని మీరు ప్రేమిస్తారా?” అని అడగగా, అందుకు రష్మిక, “వయస్సు అనేది అసలు విషయమే కాదు. ఎదుటి వ్యక్తితో మనకి బాగా అనిపించాలి. మనకు నచ్చాలి. అప్పుడే అది ప్రేమ అవుతుంది” అని అన్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే రష్మిక ప్రస్తుతం తెలుగులో ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తుండగా, కిషోర్ తిరుమల దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. అంతే కాకుండా హిందీలో కూడా రెండు సినిమాల్లో రష్మిక హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇవన్నీ మాత్రమే కాకుండా, పుష్ప సినిమాలో శ్రీవల్లిగా ఒక డిఫరెంట్ పాత్రతో అలరించబోతున్నారు రష్మిక.
watch video :
End of Article