ప్లీజ్ ఆపండి…రతన్ టాటా రిక్వెస్ట్.! భారతీయుడిగా పుట్టడం నేను అదృష్టంగా భావిస్తున్నాను.!

ప్లీజ్ ఆపండి…రతన్ టాటా రిక్వెస్ట్.! భారతీయుడిగా పుట్టడం నేను అదృష్టంగా భావిస్తున్నాను.!

by Mohana Priya

Ads

భారత వ్యాపార దిగ్గజం రతన్ టాటా సక్సెస్ స్టోరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన, వ్యాపార రంగం లోకి అడుగుపెట్టాలనుకునే ఎంతో మందికి స్ఫూర్తినిచ్చారు. అయితే ఎప్పుడైనా సరే మనం ఒక విషయం మాత్రం గుర్తు పెట్టుకోవాలి. ఎలాంటి గొప్ప స్థానంలో ఉన్న వ్యక్తికి అయినా సరే ఆ స్థానం అంత సులభంగా రాదు.

Video Advertisement

ratan tata request to netzines

 

మధ్యలో కొన్ని ఇబ్బందులు అలాగే అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా ఎంతో కష్టపడి రతన్ టాటా గారు వ్యాపార దిగ్గజంగా ఎదిగారు. అయితే గత కొంత కాలం నుండి చాలా మంది తమ అభిప్రాయాలని ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అదే అభిప్రాయం మెజారిటీకి ఉంటే ట్విట్టర్ లో ట్రెండ్ అవుతుంది. రతన్ టాటా గారికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు.

ratan tata request to netzines

రతన్ టాటా దేశానికి ఎంతో సేవ చేశారు, అలాగే ఎంతో కష్టపడి ఈ స్థాయికి ఎదిగారు కాబట్టి ఆయన చేసిన మంచి పనులకు గుర్తింపుగా భారతరత్న ఇవ్వాలి అని ట్విట్టర్ లో ఒక ట్రెండ్ మొదలైంది. కొన్ని రోజుల నుండి రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలి అనే ఒక హాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉంది. ఈ విషయంపై రతన్ టాటా గారు స్పందించి సోషల్ మీడియా వేదికగా ఒక నోట్ విడుదల చేశారు.

అందులో రతన్ టాటా గారు “నాకు అవార్డు ఇవ్వాలని సోషల్ మీడియాలో అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన వారిని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. కానీ నేను ఈ క్యాంపెయిన్ ఆపమని కోరుతున్నాను. నేను భారతీయుడిగా పుట్టడం, భారతదేశ అభివృద్ధి కోసం నా వంతు కృషి చేయడానికి ప్రయత్నించడం నేను అదృష్టంగా భావిస్తున్నాను.” అని పేర్కొన్నారు.


End of Article

You may also like