దీపాలు పెట్టండి అని మోఢీ పిలుపివ్వగానే రకరకాల వాదనలు వినిపించాయి. ఎందుకు పెట్టాలని కొందరు, దీపం పెడితే కరోనా పోతుందని కొందరు, మోదీ చెప్పాడు కాబట్టి చేసి తీరాల్సిందే అని మరికొందరు ఇలా.. ఏదైతేనేం పెట్టేవారు దీపాలు పెట్టారు, పెట్టని వారు పెట్టలేదు..కొందరు దీపావళి చేసారు.  అయితే ఆ రోజు సోషల్ మీడియాలో వచ్చిన ఫోటోలలో చాలా ఫొటోలు ఆసక్తికకరంగా అనిపించాయి.వాటిల్లో రతన్ టాటా గారిది కూడా ఒకటి.

Video Advertisement

ఎనభై మూడేళ్ల వయసు, లక్షల కోట్లకి అధిపతి, ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన వ్యాపార సామ్రజ్యం.అయినప్పటికి ఎవరో చెప్పింది నేనెందుకు వినాలి అనే గర్వం లేదు . మన దేశ ప్రధాని చెప్పారు, పౌరుడిగా చేయాలి అనుకున్నారు చేసారు..చాలా ముచ్చటగా అనిపించింది ఆ ఫోటో . మన దేశంలో కోవిడ్ -19 ని అరికట్టడానికి 1500 కోట్లు ఇచ్చిన మహామనిషి అతను, దేశం కోసం నా యావదాస్తి రాసివ్వడానికైనా సిద్దం అని ప్రకటించిన మహానుభావుడు..

 

ఇది ఇలా ఉండగా…సోషల్ మీడియాలో రతన్ టాటా గారి ఫొటోతో ఓ ఫేక్ వార్త వైరల్ అవుతుంది. కరోనా మహమ్మారి కారణంగా ఇండియా ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోతోందని నిపుణులు అంచనా వేస్తున్నారని రతన్ టాటా అన్నట్లు ఒక న్యూస్ వైరల్ అయ్యింది.చాలా మంది షేర్ కూడా చేసారు.

ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదని రతన్ టాటా ఖండించారు.తాను అటువంటి వ్యాఖ్యలు చేయలేదని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేసారు. తాను ఏదైనా చెప్పాల్సి వస్తే, మీడియాతో నేరుగా చెబుతానని అన్నారు.వాట్స్ యాప్ తదితర సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను నమ్మవద్దని కోరారు.