Ads
ప్రస్తుతం ఎక్కడ చూసినా నడుస్తున్న ఒకే ఒక్క టాపిక్ బడ్జెట్. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న కారణంగా భారతదేశ ప్రజల ఆలోచనలు మొత్తం బడ్జెట్ మీదే ఉన్నాయి. బడ్జెట్ తర్వాత ధర ఎలా ఉండబోతోంది అనే విషయంపై ప్రజలు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Video Advertisement
2021 సంవత్సరం బడ్జెట్ సమావేశాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడంపై, ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెట్టింది. ఆదాయ పన్ను శ్లాబ్ లో ఏ మార్పు చేయలేదు. పెట్రోల్ పై 2.50 రూపాయలు, డీజిల్ పై నాలుగు రూపాయల అగ్రి ఇన్ఫ్రా సెస్ విధించడంతో, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. అసలు బడ్జెట్ ప్రకటించిన తర్వాత ఏ ధరలు పెరుగుతాయో, ఏ ధరలు తగ్గుతాయో ఇప్పుడు చూద్దాం.
ధరలు పెరిగేవి
# పవర్ బ్యాంక్స్
# జెమ్ స్టోన్స్
# లెదర్ వస్తువులు
# టన్నల్ బోరింగ్ మిషన్స్
# ఛార్జర్స్
# ముడి పట్టు దిగుమతి
# మొబైల్ ఫోన్స్
ధరలు తగ్గేవి
# వ్యవసాయ సామగ్రి
# కాపర్ వస్తువులు
# స్టీల్
# బీమా
# నైలాన్ దుస్తులు
# బూట్లు
# ఐరన్
ఇంక బడ్జెట్ సమావేశాల విషయానికొస్తే, మూడో రోజు కూడా బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. ఇందులో ముఖ్యంగా రైతు సమస్యలపై ప్రస్తుతం జరుగుతున్న పోరాటాల గురించి చర్చిస్తారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.
End of Article