Home Bigg Boss 5 telugu “నిర్వాహకులకు కూడా ఈ విషయం తెలుసు..!” అంటూ… ఎలిమినేషన్ పై రవి షాకింగ్ కామెంట్స్..!

“నిర్వాహకులకు కూడా ఈ విషయం తెలుసు..!” అంటూ… ఎలిమినేషన్ పై రవి షాకింగ్ కామెంట్స్..!

by Mohana Priya

బిగ్ బాస్ లో ఎవరు ఊహించని విధంగా రవి ఎలిమినేట్ అయ్యారు. ఫైనల్స్ వరకు వస్తారు అనుకున్న కంటెస్టెంట్స్ లో రవి ఒకరు. కానీ రవి ఎలిమినేట్ అవ్వడంతో ప్రస్తుతం షోపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

“మా ఓట్లు మీద ఎలిమినేట్ అయ్యే వారిని నిర్ణయించనప్పుడు మేము ఓట్లు వెయ్యడం ఎందుకు? అసలు ఓటింగ్ పెట్టడం ఎందుకు?” అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. రవి కూడా తాను ఎలిమినేట్ అవుతాను అని ఎక్స్పెక్ట్ చెయ్యలేదు అని బిగ్ బాస్ బజ్ లో చెప్పారు. రవి ఎలిమినేట్ అవ్వడంపై అభిమానులు అందరూ కూడా తీవ్ర స్థాయిలో నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. రవి ఎలిమినేట్ అయిన రోజు అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర కొంత మంది అభిమానులు రవి మళ్ళీ షోకి తిరిగి రావాలి అంటూ ధర్నా చేసారు.

ravi about his fans opposing his elimination in bigg boss telugu 5

ఎలిమినేట్ అయిన తర్వాత రవి తన ఎలిమినేషన్ పై రియాక్ట్ అయ్యారు. రవి మీడియాతో మాటాడుతూ ఈ విధంగా అన్నారు, “నేను ఎలిమినేట్ అవుతాను అని ఊహించలేదు. ఎవిక్షన్ ఫ్రీ కార్డ్ ఉపయోగించడం అక్కడ విషయం కాదు. సన్నీ ఉపయోగిస్తాడని అనుకున్నాను. కానీ నాకు కాజల్ కంటే తక్కువ ఓట్స్ వచ్చాయి. నేను గేమ్ బానే ఆడాను. నా పొరపాట్లు ఏంటో ఇప్పుడు నేను అనలైజ్ చేసుకోవాలి ” అని అన్నారు.

ravi about his fans opposing his elimination in bigg boss telugu 5

“నేను బయటికి రావడం అన్యాయం అని అందరు అంటుంటే నాకు కొంచెం గర్వంగా ఉంది. నా విషయంలో తప్పు జరిగింది అని నా సన్నిహితులు, అభిమానులు అనుకుంటున్నారు. షో నిర్వాహకులు కూడా నా విషయంలో ఎక్కడో తప్పు జరిగింది అని భావిస్తున్నారు. నన్ను ఇంతగా సపోర్ట్ చేసినందుకు అందరికి థాంక్స్” అని రవి అన్నారు.

watch video :

You may also like