Ads
కొన్ని సినిమాలు ఎంత కాలమైనా సరే ప్రేక్షకులకి గుర్తుండిపోతాయి. ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాలని మాత్రం ప్రేక్షకులు అస్సలు మరిచిపోరు. అలా ఎంతో మంది ఇప్పటికి కూడా గుర్తు పెట్టుకున్న సినిమాల్లో అనసూయ ఒకటి. 2007 లో విడుదలైన ఈ సినిమాకి రవి బాబు దర్శకత్వం వహించగా భూమిక ప్రధాన పాత్రలో నటించారు. డిఫరెంట్ స్టోరీ తో పాటు, క్యారెక్టరైజేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాని ఎంతగానో ఆదరించారు.
Video Advertisement
ఈ సినిమాలో ఇంకొక ముఖ్య పాత్రలో నిఖిత నటించారు. అనసూయ సినిమాలో తన పర్ఫామెన్స్ కి ఎన్నో ప్రశంసలు అందుకున్నారు భూమిక. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమాకి సంబంధించిన ఒక సంఘటనని రవి బాబు గుర్తుచేసుకున్నారు. ఆ ఇంటర్వ్యూ లో యాంకర్ “యాక్టర్ గా ఇబ్బందిపడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా?” అని అడగగా అందుకు రవి బాబు ఈ విధంగా సమాధానం ఇచ్చారు.
రవి బాబు మాట్లాడుతూ “అనసూయ చేస్తున్నప్పుడు భూమికతో వర్క్ జరుగుతోంది. నేను యాక్ట్ చేస్తున్నాను. తర్వాత నా ట్రాన్స్ఫర్మేషన్ సీన్ జరిగింది. అందుకోసం నేను గడ్డం తీసేసి, ఐబ్రోస్ తీసేసి గుండుతో ఉండాలి. షూటింగ్ జరుగుతున్నప్పుడు మధ్యాహ్నం భూమిక వచ్చి తనకి ఒంట్లో బాలేదు అని చెప్పారు. అందుకు నేను “సరే ఇవాళ డే ఆఫ్ తీసుకోండి. రేపటి నుండి షూటింగ్ చేద్దాం”అని చెప్పాను.
మరుసటి రోజు ఫోన్ చేసి తనకి ఒంట్లో బాలేదు అని తను ముంబై వెళ్లాలి అనుకుంటున్నట్టు చెప్పారు. “మళ్లీ ఎప్పుడు రిటర్న్ అవుతారు?” అని అడిగితే తన ఆరోగ్యం సెట్ అయిన వెంటనే వస్తాను అని చెప్పారు. భూమిక 40 రోజుల వరకు షూటింగ్ కి రాలేదు.
ఆ రోజే నేను జుట్టు, ఐబ్రోస్ తీసేసాను. ఒకవేళ ఇది షూటింగ్ కి ముందు రోజు జరిగి ఉంటే నేను జుట్టు, ఐబ్రోస్ తో ఉండే వాడిని. కరెక్ట్ గా ఐబ్రోస్ తీశాను. గుండు కొట్టాను. భూమిక వెళ్ళిపోయారు. 40 రోజుల వరకు రాలేదు. ఇంక ఆ టైంలో నేను ఎక్కడికి వెళ్లాలన్నా కూడా పెద్ద కళ్ళజోడు పెట్టుకుని, టోపీ పెట్టుకుని తిరగాల్సి వచ్చింది.” అని అన్నారు.
watch video :
End of Article