Home Bigg Boss 5 telugu Bigg Boss Telugu – 5: “ఐ లైక్ హిమ్ అని చెప్పింది.!” అంటూ… “సిరి-షన్ను” రిలేషన్ పై రవి కామెంట్స్.!

Bigg Boss Telugu – 5: “ఐ లైక్ హిమ్ అని చెప్పింది.!” అంటూ… “సిరి-షన్ను” రిలేషన్ పై రవి కామెంట్స్.!

by Mohana Priya

బిగ్ బాస్ లో ఎవరు ఊహించని విధంగా రవి ఎలిమినేట్ అయ్యారు. ఫైనల్స్ వరకు వస్తారు అనుకున్న కంటెస్టెంట్స్ లో రవి ఒకరు. కానీ రవి ఎలిమినేట్ అవ్వడంతో  ప్రస్తుతం షోపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

“మా ఓట్లు మీద ఎలిమినేట్ అయ్యే వారిని నిర్ణయించనప్పుడు మేము ఓట్లు వెయ్యడం ఎందుకు? అసలు ఓటింగ్ పెట్టడం ఎందుకు?” అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. రవి కూడా తాను ఎలిమినేట్ అవుతాను అని ఎక్స్పెక్ట్ చెయ్యలేదు అని బిగ్ బాస్ బజ్ లో చెప్పారు.

ఈ ప్రోగ్రాంలో రవి ఇంకా చాలా విషయాలపై మాట్లాడారు. అందులో భాగంగా షణ్ముఖ్, సిరి రిలేషన్ పై కూడా రవి మాట్లాడారు. ఈ విషయంపై రవి మాట్లాడుతూ ఈ విధంగా అన్నారు, “సిరి చోటుని ఎంత లవ్ చేస్తుందో, షన్ను దీప్తిని ఎంత లవ్ చేస్తాడో తెలుసు. కానీ ఒకరిపై ఒకరికి ఇష్టం ఉంది. ఒక సారి సిరి “అన్నా ఐ లైక్ హిమ్” అని చెప్పింది” అని అన్నారు. ఇది మాత్రమే కాకుండా రవి ఇంకా చాలా విషయాలపై ఈ షోలో మాట్లాడారు.

ravi comments about shannu siri relationship

మానస్, ప్రియాంక గురించి కూడా రవి మాట్లాడారు. ప్రియాంక గేమ్ మీద ఇంకా తనకి పూర్తి స్పష్టత రాలేదని, తెలుసుకునే లోపే టైం అయిపోయింది అని అన్నారు రవి. “మానస్ కి ప్రియాంక మీద అంతే స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉన్నాయా?” అనే ప్రశ్నకి, “ఆలా ఏం లేదు” అని రవి చెప్పడం మనం ఈ ప్రోమోలో చూడొచ్చు.

watch video :

You may also like