Ads
ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సందడి చేస్తున్నారు. షో అయిపోయిన తర్వాత దాదాపు ప్రతి మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ లో, అలాగే యూట్యూబ్ ఛానల్స్ లో కూడా ఎన్నో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇంక అసలు షో టెలికాస్ట్ అయిన స్టార్ మాలో ఏదైనా ఈవెంట్ అయితే కంటెస్టెంట్స్ రాకుండా ఉండటం అనేది జరగని పని.
Video Advertisement
అలా స్టార్ మా ఛానల్ లో సంక్రాంతి సందర్భంగా “ఇట్స్ ఎ ఫామిలీ పార్టీ” అనే ఒక ఈవెంట్ ప్రసారం అవ్వబోతోంది. అందులో బిగ్ బాస్ విజేత అభిజిత్, టాప్ నాలుగవ కంటెస్టెంట్ అరియానా, అలాగే లాస్య కూడా రాబోతున్నారు. వీరితో పాటు ఇంకొంత మంది సెలబ్రిటీలు కూడా ఈ ఈవెంట్ లో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోని ఇటీవల యూట్యూబ్ లో విడుదల చేశారు.
అయితే ఇందులో అందరి దృష్టిలో పడింది ఒక్క విషయం మాత్రమే. ఈ ఈవెంట్ కి యాంకర్ రవి కూడా రాబోతున్నారు. అంతకుముందు రవి, లాస్య కలిసి యాంకరింగ్ చేసినట్టు, గత ఐదు సంవత్సరాలుగా రవి లాస్యల మధ్య విభేదాలు ఉన్నట్టు మనందరికీ తెలిసిందే. ఈ షో ద్వారా వాళ్లిద్దరూ మళ్లీ స్నేహితులుగా మారబోతున్నారు.
రవి లాస్యని క్షమాపణలు అడిగారు. లాస్య కుటుంబాన్ని రవి స్టేజ్ మీదకి తీసుకురాగా, రవి కుటుంబాన్ని లాస్య స్టేజ్ మీదకు తీసుకొచ్చారు. అంతే కాకుండా వీళ్ళిద్దరూ కలిసి ఈ ఈవెంట్ కి యాంకరింగ్ కూడా చేయబోతున్నారు. ఈ ప్రోగ్రాంలో బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ రవి కృష్ణ, జబర్దస్త్ సుధాకర్, బాబా భాస్కర్, అవినాష్, రచ్చ రవి, యాదమ్మ రాజు, లోబో తో పాటు మరి కొంత మంది సెలబ్రెటీలు పాల్గొన్న ఈ ఈవెంట్ ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.
watch video :
End of Article