Ads
గ్రామీణ నేపథ్యంలో వచ్చే చిత్రాలకు ఇటీవల కాలంలో ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ వస్తోంది. గ్రామీణ అందాలను, ఊరి కట్టుబాట్లని హత్తుకునేలా ఆవిష్కరిస్తున్నారు. అలా వచ్చిన బలగం సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన `సగిలేటి కథ` నేడు రిలీజ్ అయ్యింది. ఆ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
Video Advertisement
- చిత్రం : సగిలేటి కథ
- నటీనటులు : రవి మహాదాస్యం,విశిక కోట,నరసింహ ప్రసాద్,రాజశేఖర్, సుదర్శన్, సాయి మోహన్ తదితరులు..
- నిర్మాత : అశోక్ మిట్టపల్లి, దేవి ప్రసాద్ బలివాడ
- దర్శకత్వం : రాజశేఖర్ సూద్మూన్
- సంగీతం : జస్వంత్ పసుపులేటి
- విడుదల తేదీ : అక్టోబర్ 13, 2023
స్టోరీ :
2007లో సాగే రాయలసీమలోని సగిలేరు అనే పల్లెటూరు కథ ఇది. ఆ ఊరి పెద్దలు చౌడప్ప(రాజ శేఖర్ అనింగి), మరియు ఆర్‌ఎంపీ డాక్టర్ దొరసామి(రమేశ్) మిత్రులు. చౌడప్ప కుమారుడు కుమార్ (రవి మహాదాస్యం) కువైట్ నుంచి తన ఊరికి వస్తాడు. కుమార్ చూడగానే కృష్ణవేణి(విషిక కోట)తోప్రేమిస్తాడు.ఆమె దొరసామి కూతురు.ఆమె కూడా కుమార్ ని ప్రేమిస్తుంది. తమ ప్రేమ గురించి ఇద్దరి ఇంట్లోవారికి చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటారు.
ఆ ఊరిలో వర్షాలు పడకపోవడంతో ప్రజలు అనావృష్టితో ఇబ్బందులు పడతుంటారు.ఊరి పెద్ద లందరు ఈ సమస్య తీరాలంటే గంగాలమ్మ జాతర చేయాలని తీర్మానిస్తారు. కానీ జాతర చేసే సమయంలో అడ్డంకి ఏర్పడుతుంది. ఆ సమస్యను ఊరిపెద్దలు ఎలా పరిష్కరించారు? కుమార్,కృష్ణవేణి ప్రేమకు, గంగాలమ్మ జాతరకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అనేది మిగిలిన కథ.
రివ్యూ :
సీనియర్ జర్నలిస్టు, రైటర్ బత్తుల ప్రసాదరావు ‘సగిలేటి కథలు’ లోని ఒక స్టోరీ ఆధారంగా దర్శకుడు రాజశేఖర్ సుడ్మూన్ ఈ సినిమాని తెరకెక్కించాడు . గ్రామీణ నేపథ్యంతో వినోదాత్మకంగా ఈ సినిమాని తెరకెక్కించాడు. రాయలసీమ గ్రామీణ వాతావరణాన్ని, భాష, యాస, ఎమోషన్స్ ని మనుషుల మనస్తత్వాలను, కల్చర్ ఈ చిత్రంలో చూపించేందుకు ప్రయత్నం చేశారు.
స్టోరీ పరంగా కొత్తగా లేదు, హీరోహీరోయిన్ల రొటీన్ ప్రేమకథ. రోషం రాజు పాత్ర కోడి కూర కోసం పడే పాట్లు నవ్వు తెప్పిస్తాయి. చౌడప్ప తన మిత్రుడిని చంపిన తర్వాత స్టోరీ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. మూవీ అంతా ఒకెత్తు అయితే, సినిమా చివర్లోని ట్విస్ట్ మరోక ఎత్తు. అప్పటి దాకా మెల్లగా సాగిన స్టోరీ, కొన్ని క్యారెక్టర్స్,క్లైమాక్స్‌లో వారు ఇచ్చే ట్విస్టులు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. నూతన నటీనటులైనా, ప్రతీ ఒక్కరు కూడా నటనతో ఆకట్టుకున్నారు. హీరో రవి మహాదాస్యం, హీరోయిన్ విషికా కోట తమ నటనతో ఆకట్టుకున్నారు. రోషమ్ రాజు క్యారెక్టర్ బాగుంది. తనదైన కామెడీతో రోషమ్ రాజు ఆకట్టుకున్నాడు.
ప్లస్ పాయింట్స్ :
- ఎంచుకున్న పాయింట్,
- సినిమాటోగ్రఫీ,
- బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్:
- కథనం,
- నూతన నటీనటులు.
- లాజిక్ లేని సీన్స్.
రేటింగ్ :
2.5 / 5
ట్యాగ్ లైన్ :
లాజిక్కులు వెతకకుండా మూవీ చూసేవారికి, గ్రామీణ నేపథ్యంలో వచ్చే సినిమాలను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది.
watch trailer :
Also Read: నీతోనే నేను సినిమా ఎలా ఉందంటే
End of Article