Home Filmy Adda Ravanasura Review : “రవితేజ” కి మరొక హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Ravanasura Review : “రవితేజ” కి మరొక హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya
  • చిత్రం : రావణాసుర
  • నటీనటులు : రవితేజ, సుశాంత్, అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, దక్ష నాగార్కర్.
  • నిర్మాత : అభిషేక్ నామా, రవితేజ
  • దర్శకత్వం : సుధీర్ వర్మ
  • సంగీతం : హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో
  • విడుదల తేదీ : ఏప్రిల్ 7, 2023

ravanasura movie review

స్టోరీ :

రవీంద్ర (రవితేజ) ఒక క్రిమినల్ లాయర్. తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయిన కనక మహాలక్ష్మి (ఫరియా అబ్దుల్లా) దగ్గర జూనియర్ లాయర్ గా పని చేస్తూ ఉంటాడు. ఇంతలో హారిక (మేఘ ఆకాష్) తండ్రి సంపత్ ఒక హత్య కేసులో ఇరుక్కుంటాడు. రవీంద్ర ఈ కేస్ టేకప్ చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. అసలు ఆ హత్య ఎవరు చేశారు? చనిపోయింది ఎవరు? వీటికి రవీంద్రకి ఏమైనా సంబంధం ఉందా? రవీంద్ర, సాకేత్ (సుశాంత్) ని ఎలా కలిశాడు? అసలు ఈ సాకేత్ ఎవరు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

ravanasura movie review

రివ్యూ :

ఇటీవల వచ్చిన ధమాకా సినిమాతో హిట్ కొట్టారు రవితేజ. అలాగే చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా ఒక ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు రావణాసుర సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా ట్రైలర్ చూస్తే ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అని అర్థం అవుతోంది.

ravanasura movie review

ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఒక కమర్షియల్ సినిమాలో నడిచినట్లుగానే నడుస్తుంది. సెకండ్ హాఫ్ లో సినిమా స్పీడ్ పెరుగుతుంది. కానీ అది ముందుకు వెళ్లే కొద్దీ ప్రేక్షకులకి తర్వాత ఏం జరుగుతుంది అనేది అర్థం అవుతూ ఉంటుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నటీనటులు అందరూ కూడా వారి పాత్రలకి తగ్గట్టుగా నటించారు. కానీ సినిమా మొత్తానికి పెద్ద హైలైట్ మాత్రం రవితేజ పాత్ర.

ravanasura movie review

ఇందులో రవితేజ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు. ఫస్ట్ హాఫ్ లో వచ్చే రవితేజ పాత్ర మనం అంతకుముందు చాలా సినిమాల్లో రవితేజని చూసిన పాత్ర లాగానే ఉన్నా కూడా సెకండ్ హాఫ్ లో రవితేజ పోషించిన పాత్ర అంతకుముందు ఎప్పుడు చేయలేదు. పాటలు కూడా బాగున్నాయి. కానీ స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

  • రవితేజ
  • పాటలు
  • కొన్ని యాక్షన్ సీన్స్
  • ఇంటర్వల్ కి ముందు వచ్చే ట్విస్ట్

మైనస్ పాయింట్స్:

  • కామెడీ
  • డల్ గా సాగే స్క్రీన్ ప్లే
  • తెలిసిన కథ
  • లాజిక్ లేని కొన్ని సీన్స్

రేటింగ్ :

2.75/5

ట్యాగ్ లైన్ :

సినిమా నుండి పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, అందులోనూ ముఖ్యంగా ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూస్తున్నాం అని అనుకోకుండా, కేవలం రవితేజ కోసం సినిమా చూడాలి అనుకుంటే ఈ సినిమా అస్సలు నిరాశపరచదు. మామూలు ప్రేక్షకులకి అయితే రావణాసుర సినిమా ఒక్కసారి చూడగలిగే సినిమాగా నిలుస్తుంది.

watch trailer :

You may also like