Home Filmy Adda Ravi Teja : మళ్లీ రవి తేజకి ఆ కామెంట్స్ తప్పవా.?

Ravi Teja : మళ్లీ రవి తేజకి ఆ కామెంట్స్ తప్పవా.?

by Mohana Priya

ప్రస్తుతం వరుస షూటింగ్లతో బిజీగా ఉన్న హీరోల్లో మాస్ మహారాజ రవి తేజ ఒకరు. ఇటీవల ఖిలాడీ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న రవి తేజ, ఇప్పుడు రామారావు ఆన్ డ్యూటీ సినిమా షూటింగ్ పనిలో ఉన్నారు. ఇవి మాత్రమే కాకుండా మరి కొన్ని సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి. అందులో దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఒకటి. ఈ సినిమాలో హీరోయిన్ కోసం ప్రస్తుతం అన్వేషణ జరుగుతోంది. వీరిలో ఒక హీరోయిన్ పేరు మాత్రం బలంగా వినిపిస్తోంది. పెళ్లి సందడి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న శ్రీలీల రవి తేజ పక్కన నటిస్తున్నారు అనే వార్త వినిపిస్తోంది.5 raviteja

ఒకవేళ అదే నిజమయితే కనుక రవి తేజ మళ్లీ విమర్శలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కొద్ది సంవత్సరాల క్రితం విడుదలైన నేల టికెట్ సినిమాలో మాళవిక శర్మ తో కలిసి నటించారు రవి తేజ. వారి ఇద్దరి పెయిర్ చూడడానికి అసలు బాగాలేదు అని అప్పట్లో చాలా కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు శ్రీలీల కూడా దగ్గర దగ్గర మాళవిక శర్మ వయసు ఉన్న వారే. దాంతో మళ్లీ రవి తేజ ఆ విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఏమో అని రవి తేజ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఈ విషయం గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

You may also like