Home Bigg Boss 5 telugu ప్రియ వ్యాఖ్యలపై స్పందించిన రవి భార్య..! వైరల్ అవుతున్న పోస్ట్.!

ప్రియ వ్యాఖ్యలపై స్పందించిన రవి భార్య..! వైరల్ అవుతున్న పోస్ట్.!

by Mohana Priya

బిగ్ బాస్ తెలుగు సీజన్-5 లో రోజు రోజుకి వివాదాలు పెరిగిపోతున్నాయి. ఒక్కొక్క రోజు కంటెస్టెంట్స్ అందరూ బాగా మాట్లాడుకుంటారు. కానీ మళ్లీ కొద్ది రోజులకి గొడవలు మొదలవుతున్నాయి. ఇలా ఇప్పటికీ చాలా కంటెస్టెంట్స్ మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఇలా కొన్ని గొడవలు, కొన్ని టాస్క్ లతో బిగ్ బాస్ మూడవ వారంలోకి అడుగు పెట్టింది. నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ లో నామినేషన్ సందర్భంగా జరిగిన ఘటన చర్చలకు దారి తీసింది. లహరి, ప్రియని నామినేట్ చేస్తూ, “ప్రియ నాతో కలిసి ఉండడం లేదు. మనసులో ఏదో పెట్టుకుని నా నుండి దూరంగా ఉంటున్నారు” అని అన్నారు.

ravi wife nitya reaction on priya comments in bigg boss telugu 5

అందుకు ప్రియ “నువ్వు ఎప్పుడూ మగవాళ్ళ తోనే మాట్లాడతావు. నీకు ఆడవాళ్ళ అవసరం లేదు. రవి, మానస్, హౌస్ లో ఉన్న అబ్బాయిలతో ఉంటావు” అని మాట్లాడారు. మాటా మాటా పెరిగి చాలా గొడవలు అయ్యాయి. అందుకు లహరి కూడా రవి తనకి సోదరుడు లాంటివారు అని చెప్పారు. తర్వాత ప్రియకి అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని గట్టిగా చెప్పారు లహరి. దాంతో గొడవ చాలా పెద్దది అయ్యింది. ఈ నేపథ్యంలో రవి భార్య నిత్య ఈ విషయంపై స్పందించారు. తన ఇంస్టాగ్రామ్ లో ఈ విషయంపై స్పందిస్తూ ఒక పోస్ట్ చేశారు నిత్య. నిత్య తన ఇంస్టాగ్రామ్ లో రవి ఫోటో పోస్ట్ చేసి ఈ విధంగా క్యాప్షన్ పెట్టారు.ravi wife nitya reaction on priya comments in bigg boss telugu 5

“నేను బానే ఉన్నానా లేదా అని అని చాలా మెసేజెస్ వస్తున్నాయి. ఇంత ప్రేమకి, సహకారానికి చాలా థాంక్యూ. నేను బాగున్నాను. థాంక్యూ సో మచ్. నేను రవి చాలా డిఫికల్ట్ సిట్యువేషన్స్ ఫేస్ చేశాము. కానీ మా మధ్య ఉన్న నమ్మకం మా బంధాన్ని ఇంకా బలంగా చేసింది. మీరు ఇచ్చిన సహకారం వల్ల నేను బాగోకపోయే ప్రసక్తే లేదు” అని అర్థం వచ్చేలాగా రాశారు. నెటిజన్లు కూడా నిత్యకి “మీరు ధైర్యంగా ఉండండి” అని కామెంట్స్ ద్వారా సపోర్ట్ ఇస్తున్నారు.

 

https://www.instagram.com/p/CUDaXRJhU_3/?utm_source=ig_web_copy_link

You may also like