కొంత కాలం నుండి రవీంద్ర జాడేజా టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీటిపై రవీంద్ర జడేజా స్పందించారు. తన రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని ఖండించారు.

Video Advertisement

లాంగ్ వే టు గో (చాలా సమయం ఉంది) అని రాసి ఒక ట్వీట్ షేర్ చేసారు. ఈ ట్వీట్ తో పాటు జడేజా జెర్సీ ధరించిన ఒక ఫోటో కూడా షేర్ చేసారు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో గాయపడిన జడేజా, రెండో టెస్ట్‌కి దూరమైన విషయం తెలిసిందే.

ravindra jadeja denies rumors about his test retirement

 

జడేజాకి తీవ్ర గాయం అవ్వడంతో సెలెక్టర్లు దక్షిణాఫ్రికా పర్యాటనకి ఎంపిక చేయలేదు. జడేజా ప్రస్తుతం ముంచేతి గాయానికి చికిత్స తీసుకుంటున్నారు. రవీంద్ర జడేజా కొలుకోవడానికి మరో 6 నెలలు పట్టొచ్చు అని డాక్టర్లు చెప్తున్నారు. టీమిండియా తరఫున 57 టెస్ట్‌ల్లో 232 వికెట్లు సాధించడం మాత్రమే కాకుండా 2195 పరుగులు కూడా చేసారు రవీంద్ర జడేజా.