రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతోంది అనే విషయం అందరికీ తెలుసు. ఈ సినిమాని దిల్ రాజు గారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియన్ సినిమాగా విడుదల కాబోతోంది. అయితే ఇందులో హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారు అని చాలా మంది పేర్లు వచ్చాయి. ముందు ఒక చైనీస్ నటి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తారు అని అన్నారు.

rc 15 heroine

ఆ తర్వాత కియారా అద్వానీ పేరు వినిపించింది. ఇప్పుడు మాత్రం మరొకరు హీరోయిన్ గా ఫిక్స్ అయ్యారు అనే వార్త బలంగా వినిపిస్తోంది. గత రెండు సంవత్సరాల నుండి హిట్ మీద హిట్ కొడుతూ దూసుకుపోతున్న రష్మిక మందన్న రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు అనే ప్రచారం జరుగుతోంది.

Rashmika mandanna in Times most desirable women list

కొన్ని రోజుల క్రితం ఈ సినిమాకి డైలాగ్ రైటర్ గా సాయి మాధవ్ బుర్రా గారిని తీసుకున్నారు. మెయిన్ కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ వ్యవహరిస్తున్నారు. అలాగే తమన్ సంగీత దర్శకత్వం అందిస్తున్నారు. ఇలా సర్ప్రైజ్ గా సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ని విడుదల చేశారు. ఇదే విధంగా హీరోయిన్ గురించి కూడా అప్డేట్ ఇస్తారేమో వేచి చూడాల్సిందే.