సౌతాఫ్రికాలోని పోచెఫ్‌స్ట్రమ్ వేదికగా జరుగుతున్న అండర్ 19 వరల్డ్ కప్ సెమీఫైనల్ లో టీమిండియా యువజట్టు పాకిస్థాన్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. పాకిస్థాన్ నిర్దేశించిన 173 పరుగుల టార్గెట్ ను యువఇండియా జట్టు సునాయసంగా ఛేదించింది జైస్వాల్‌  బౌలర్లపై విరుచుకుపడుతూ.. 113బంతుల్లో 105పరుగులు (8ఫోర్లు, 4సిక్సులు)తో చెలరేగాడు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(105), దివ్యాంశ్ సక్సేనా(59) అద్భుతంగా రాణించడంతో వికెట్లేమీ కోల్పోకుండానే 10 వికెట్ల తేడాతో పాకిస్థాన్ పై విజయం సాధించింది. 

లక్ష్యం ముందు ఏదైనా బలాదూర్‌ అనడానికి భారత అండర్‌ 19 క్రికెటర్‌ యశస్వి జైస్వాల్‌ జీవితమే ఉదాహరణ ..యశస్వి జైస్వాల్‌ ఆకలితో పడుకున్న సందర్భాలు కోకొల్లలు.  అతని కష్టాల జాబితా చూస్తే అంతు లేదు. కానీ అతను వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్నాడు. అన్ని బాధలు భరిస్తూ కూడా క్రికెటర్‌ కావాలనే తన లక్ష్యానికి మాత్రం దూరం కాలేదు. ఇప్పుడు అదే అతన్ని కరోడ్‌పతిని చేసింది. పానీపూరి  అమ్మే స్టేజ్‌ నుంచి కోట్లకు పడగలు ఎత్తేలా చేసింది అతను నమ్ముకున్న క్రికెట్‌ జీవితం. ఈసారి ఐపీఎల్‌ వేలంలో  జైస్వాల్‌ను రూ. 2.40 కోట్లకు రాజస్తాన్‌ రాయల్స్‌ చేజిక్కించుకుంది.

ఈ 17 ఏళ్ల ఈ ముంబై కుర్రాడి గతం గురించి తెలిస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. కొన్నేళ్ల కిందట రోడ్డు ప‌క్క‌న పానీ పూరి అమ్మి రోజులు గడిపాడు. ఉత్తరప్ర‌దేశ్‌లో పేద కుటుంబానికి చెందిన యశస్వి 11 ఏళ్ల వయసులో క్రికెటర్‌ కావాలనే కోరికతో ముంబైకి చేరుకున్నాడు యశస్వి నిర్ణయానికి తల్లితండ్రులు అడ్డుచెప్పలేదు. ముంబయి చేరుకున్న తర్వాత ఓ డైరీలో పని చేసుకుంటూ… స్థానికంగా క్రికెట్‌ ఆడడం మొదలెట్టాడు. అయితే క్రికెట్‌ మీదే ఎక్కువ ఆసక్తి చూపిస్తూ పని సరిగా చేయడంలేదని యజమాని అతణ్ని పనికి వద్దన్నాడు.

అదితెలిసిన ఒక బంధువు కొన్ని రోజులు తన ఇంట్లో ఉండమని ఆశ్రయం కల్పించాడు. అది కూడా ఇరుకైందే కావడంతో తను వేరే ప్లేస్ చూసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆజాద్‌ మైదానంలోని ముస్లిమ్‌ యునైటెడ్‌ క్లబ్‌కు చెందిన గుడారాల్లో ఉండే ఏర్పాటు చేశాడు. మూడేళ్ల పాటు యశస్వి అక్కడే ఉన్నాడు.అందులో సరైన వసతులు ఉండేవి కావు. కరెంటుండేది కాదు, మూత్రశాలా లేదు. అయినా అందులోనే సర్దుకున్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్రికెట్‌ ఆడటం.. సాయంత్రం పూట పానీపూరీ అమ్మడం, మరికొన్ని పనులు చేయడం ద్వారా జీవనం సాగించాడు.

డబ్బులు సరిపోక కొన్ని కడుపు నిండకపోయినా ఓర్చుకున్నాడు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా క్రికెట్‌ను మాత్రం యశస్వి విడిచిపెట్టలేదు. అతడి ప్రతిభ గుర్తించి స్థానిక ఆటగాళ్లు, కోచ్‌లు ప్రోత్సహించారు. యశస్వి ప్రతిభను గుర్తిచిన జ్వాలా సింగ్‌ అనే కోచ్ సరైన శిక్షణ ఏర్పాటు చేసాడు ఎ-డివిజన్‌ ఆటగాళ్ల బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ పరుగులు సాధిస్తూ… గత ఏడాది అతను శ్రీలంకలో పర్యటించే భారత అండర్‌-19 జట్టుకు ఎంపికయ్యాడు. మూడో వన్డేలో చక్కటి శతకం (114) బాది భారత్‌కు సిరీస్‌ అందించాడు. ఇంగ్లాండ్‌లో వరుసగా నాలుగు అర్ధశతకాలతో అండర్‌-19 జట్టు ముక్కోణపు సిరీస్‌ గెలవడంలో యశస్విది ముఖ్య పాత్ర. లిస్ట్ ఏ క్రికెట్‌లో డబుల్ సెంచరీచేసిన పిన్న వయస్కుడిగా యశస్వి జైస్వాల్ అరుదైన రికార్డ్ సాధించి నేడు ఐపీఎల్ కు కొనుగోలు చేయబడ్డాడు.నిన్న జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ సెమీఫైనల్ లో పాకిస్థాన్‌ పై ( 113బంతుల్లో 105పరుగులు ) వీరోచిత ప్రదర్శనకు జైస్వాల్‌ను ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వరించింది. త్వరలో ఇండియా టీమ్ కు కూడా సేవలందించాలని ఆశిద్దాం.

If you want to contribute content on our website, click here

Cryptoknowmics
Sharing is Caring:
No more articles