ప్రేమ అంటే ఏంటి అని ఎవరినైనా అడిగితే ఎవరి నుండి సరైన సమాధానం రాదు. ఎందుకంటే అసలు డెఫినేషన్ ఏంటో ఎవరికీ తెలియదు కాబట్టి. అందరి ప్రేమకథలు పెళ్లి వరకు వెళ్లకపోవచ్చు.

ఎక్కడో కొంతమంది మాత్రమే వాళ్లు ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోగలుగుతారు అని అంటారు. ఇది నిజంగా ఒక వ్యక్తికి సంబంధించిన చాలా పర్సనల్ విషయం కాబట్టి వాళ్లు తీసుకున్న నిర్ణయాల వెనుక ఉన్న కారణాల గురించి ఎక్కువగా చర్చించుకోలేము.

ఇదిలా ఉండగా, కొంతకాలం క్రితం కోరా లో ఒక వ్యక్తి “మీ బెస్ట్ కపుల్ పిక్చర్ చూపించగలుగుతారా?” (Do you mind if I see your best couple picture?) అని అర్థం వచ్చేలాగా ఒక ప్రశ్న పోస్ట్ చేశారు. దానికి రంజిత్ మిశ్రా అనే ఒక వ్యక్తి ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ఆ సమాధానం రంజిత్ మిశ్రా మాటల్లోనే చదువుదాం.

“నా బెస్ట్ కపుల్ ఫోటో చూపించడానికి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. నా ఇంగ్లీష్ మీకు ప్రాబ్లం అవ్వకపోతే చాలు. మా మొదటి మీటింగ్ నుంచి మొదలు పెడదాం. నవంబర్ 2015. మా ఇద్దరికీ మొదటి ఉద్యోగం ఒకటే ఇన్స్టిట్యూట్ లో, ఒకటే డిస్ట్రిక్ట్ లో వచ్చింది. మేము ఉద్యోగం చేయాల్సిన ప్రదేశం మేము ఉండే చోట కి (డిస్ట్రిక్ట్ కి) దూరంలో ఉంది.

ఒకరోజు సాయంత్రం మేము వెళ్లాల్సిన ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు కలిశాం. పిల్లర్ నెంబర్ 9. ఇది నేను తనకు తెలియకుండా తీసిన ఫోటో. కానీ ఈ ఫోటో చూసిన తర్వాత తను కూడా ఫోటోకి రెడీగా ఉందేమో అనిపిస్తుంది.

అలా రైల్వే స్టేషన్ లో మా ప్రయాణం మొదలైంది. ఇంకొక విషయం ఏంటంటే నేను తనని ప్రపోజ్ చేసింది కూడా రైల్వే స్టేషన్ లోనే. మా లవ్ ట్రైన్, రైల్వే స్టేషన్ నుండి

రెస్టారెంట్స్ కి,

మాల్స్ కి,

పార్క్స్ కి,

సినిమా హాల్స్ కి,

మా పెళ్లి షాపింగ్ వరకు సాగి

మా ఇంటి దగ్గర ఆగింది.

థాంక్యూ” అని సమాధానం ఇచ్చారు రంజిత్ మిశ్రా.

credits: quora/ranjit mishra