“భలే మోసం చేశారుగా మావా.?”… రోర్ ఆఫ్ RRR వెనకున్న అసలు కథ ఇదా.?

“భలే మోసం చేశారుగా మావా.?”… రోర్ ఆఫ్ RRR వెనకున్న అసలు కథ ఇదా.?

by Mohana Priya

Ads

2021 లో తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా, భారత దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. బాహుబలి ద కంక్లూజన్ తర్వాత దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత మళ్లీ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. ఈ సినిమా మా ఇంత ఆసక్తి క్రియేట్ అవ్వడానికి ముఖ్యమైన అంశం రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించడం. మామూలుగా అయితే ఒక ఇద్దరు యంగ్ హీరోస్ కలిసి నటించడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం.

Video Advertisement

trolls on rrr new poster

అంటే ఒక యంగ్ హీరో, ఒక సీనియర్ హీరో కలిసి నటించడం చూస్తూ ఉంటాం. కానీ ఇలా ఇద్దరు ఒకే జనరేషన్ కి చెందిన హీరోలు కలిసి నటించడం ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. అలా ఎప్పుడో ఒకసారి జరిగినప్పుడు వచ్చిన సినిమానే ఆర్ఆర్ఆర్. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ఇంట్రడక్షన్ వీడియోస్ ఇవన్నీ ప్రేక్షకుల ఆసక్తిని ఇంకా పెంచాయి. ఈ సినిమాతో ఆలియా భట్ కూడా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.

trolls on alia bhatt first look from rrr

ఇప్పటికే ఆలియా భట్ తెలుగు నేర్చుకునే పనిలో ఉన్నారు అని ఇటీవల వకీల్ సాబ్ విడుదల సమయంలో ఆలియా భట్ చేసిన వీడియో, అలాగే కరోనా జాగ్రత్తలు చెప్తూ ఆర్ఆర్ఆర్ సినిమా బృందం చేసిన వీడియోలో ఆలియా భట్ తెలుగు మాట్లాడటం చూసి మనందరికీ అర్థమైపోయి ఉంటుంది. అలియా భట్ మాత్రమే కాకుండా ఒలీవియా మోరిస్ కూడా ఈ సినిమాలో ఇంకొక హీరోయిన్ గా నటిస్తున్నారు.

అయితే ఈ సినిమాకి సంబంధించి రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ అనే ఒక వీడియో జూలై 15వ తేదీన విడుదల చేస్తున్నట్లు సినిమా బృందం ప్రకటించింది. ఈ అనౌన్స్మెంట్ పోస్టర్ లో ఇద్దరు వ్యక్తులు కూర్చుని మాట్లాడుకుంటున్నారు కనిపిస్తారు. కానీ వారి మొహాలు మనకు సరిగ్గా కనిపించవు. అయితే ఈ సినిమాలో నటించే హీరోల మనకు తెలుసు కాబట్టి పోస్టర్లలో కచ్చితంగా వారిద్దరే ఉంటారు అని మనం అనుకుంటాం.

కానీ ఈ పోస్టర్ ని బ్రైట్ చేసి చూస్తే అందులో ఉన్న వారు జూనియర్, ఎన్టీఆర్ రామ్ చరణ్ కాదు. పోస్టర్లో ఎడమ వైపు ఉన్నది సినిమాటోగ్రఫర్ సెంథిల్ కుమార్ అయితే, కుడి వైపు ఉన్నది రాజమౌళి. దాంతో మమ్మల్నందర్నీ భలే మోసం చేశారుగా అంటూ ఈ పోస్టర్ పై సోషల్ మీడియాలో ఇలా మీమ్స్ వస్తున్నాయి.

#1

#2

#3


End of Article

You may also like