తెలుగు ప్రేక్షకులకి …నటి సితార అంటే తెలియని వారు ఉండరు అటు కన్నడ,ఇటు తెలుగు ఇండస్ట్రీ లో ఎంత గొప్ప పేరున్న నటీమణుల్లో సితార గారు ఒకరు.ఆమెను చూడగానే మనకు మన కుటుంబ సభ్యుల్లో ఒకరిని చూసినట్టే ఉంటుంది.అందుకే ఎక్కువ శాతం దర్శక నిర్మాతలు సెలెక్ట్ చేసుకోవడంలో మొదటి వ్యక్తి గా ముందు వరసలో ఉంటారు..కన్నడ,తెలుగు అనే తేడా లేకుండా అందరికి దగ్గరయిన నటి సితారా ..ఆమె జీవితంలో కొన్ని విషాద సంఘటనలు కూడా ఉన్నాయి. ఇటీవలే ఆమె చెప్పిన కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం…

Video Advertisement

నటి సితార మాతృ బాషా మలయాళం అయినప్పటికీ కన్నడ ప్రేక్షకులకి ఎంతో…దగ్గర అయ్యారు..కన్నడ సూపర్ హిట్ సినిమాలలో నటించారు కేవలం కన్నడ మాత్రమే కాదు తెలుగు,తమిళం,మలయాళం భాషల్లో నటించి మెప్పించారు.ఆమె వయసు 46 సంవత్సరాలు కానీ సితారా గారు ఇంతవరకు పేళ్ళి చేసుకోలేదు ఈ విషయం ఇంతవరకు ఎవరికీ తెలిసి ఉండదు కూడా…ఇటీవలే ఇంటర్వ్యూ లో ఈ విషయం చెప్పారు నటి సితారా కేరళలోని కిలిమానూర్ లో జన్మించారు తల్లిదండ్రుల పేర్లు రామేశ్వరన్ నాయర్ మరియు వల్సల నాయర్. సీతారా కాలేజీలో చదువుతూ సినిమాల్లోకి ప్రవేశించింది

పెళ్లి చేసుకోపోవడానికి గల కారణాన్ని వివరిస్తూ మా నాన్నగారు అంటే నాకెంతో ఇష్టం.ప్రతి విషయంలోనూ నాకు ఎంతో సపోర్ట్ గా నిలిచేవారు నేను చేసే ప్రతి పనుల్లో ఆయన్నే సలహా ని అడిగేదాన్ని అలాంటి వ్యక్తి హఠాత్తుగా మరణించారు దాని తరువాత కొన్ని సంవత్సరాల పాటు సినిమాకి దూరమయ్యాను ఇక అటు తరువాత పెళ్లి గురించి పెద్దగా ఆలోచించింది లేదు…అని తెలిపారు భవిష్యత్ లో అలాంటి ఆలోచనేగనుక ఉంటె తప్పక తెలియచేస్తానంటూ అన్నారు.