Ads
రెబెల్ స్టార్ కృష్ణం రాజు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రౌద్ర రసం పండించాలన్నా.. భక్తుడిగా మెప్పించాలన్నా ఆయన తర్వాతే ఎవరైనా..
Video Advertisement
ఆరు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్నటు వంటి కృష్ణంరాజు అనారోగ్య సమస్యల కారణంగా కొద్ది రోజుల క్రితం మృతి చెందారు. దీనితో ప్రభాస్ తాజాగా ఒక నిర్ణయం తీసుకున్నారు. రెబెల్ స్టార్ కృష్ణం రాజు గారిని ఆయన ఆరాధ్య దైవంగా భావిస్తారు.
ఆయన మరణించడంతో ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్టులను పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది. మాములుగా అయితే ప్రాజెక్ట్ కే, సలార్ సినిమాలు కొత్త షెడ్యూల్ షురూ అవ్వాల్సి వుంది. ఇది ఇలా ఉంటే అమిత్ షా హైదరాబాద్ కు వస్తున్నారని తెలుస్తోంది.
ఎందుకు ఆయన వస్తున్నారు..?, దీనికి కారణం ఏమిటి అనేవి చర్చనీయాంశంగా మారింది. అయితే కృష్ణంరాజు గారు బీజేపీ నేతగానే మరణించారు. అందుకే కృష్ణంరాజు కుటుంబ సభ్యులను అమిత్ షా మీట్ అవ్వచ్చు. ఇందులో విడ్డూరం ఏమి లేదు. అమిత్ షా కలవడం వెనుక రాజకీయ కారణాలు లేవు.
అమిత్ షా వస్తే మాత్రం రాజకీయ వర్గాల్లో ప్రభాస్ గురించి కూడా చర్చ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కానీ ప్రభాస్ మాత్రం రాజకీయాల్లో దృష్టి పెట్టేలా కనపడడం లేదు. సినిమాల్లో ప్రభాస్ కి మామూలు క్రేజ్ లేదు కనుక ప్రభాస్ రాజకీయాల్లో దృష్టి పెట్టేలా లేడు.
End of Article