Ads
మీరు ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా మంది సెలబ్రెటీలు, నాన్ సెలబ్రిటీలు వాళ్ల బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు పోస్ట్ చేయడం చూసే ఉంటారు. తెలిసిన వాళ్ళని కూడా అలా ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో పోస్ట్ చేయడానికి నామినేట్ చేసి # ఛాలెంజ్ యాక్సెప్టెడ్ # విమెన్ సపోర్ట్ విమెన్ # బ్లాక్ అండ్ వైట్ ఛాలెంజ్ అనే హాష్ ట్యాగ్ తో ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. చాలామందికి పోస్ట్ చేయడానికి వెనకాల ఉన్న కారణం తెలియదు. అలా బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు పోస్ట్ చేయడం వెనక ఉన్న కారణం ఏంటి అంటే.
Video Advertisement
టర్కీలో చాలామంది ఆడవాళ్ళు కారణం తెలియకుండా హత్యకు గురవుతున్నారు. 2010 సంవత్సరం నుండి దాదాపు వెయ్యి మంది మహిళలు హత్య చేయబడ్డారు. జూలైలో 40 మంది మహిళలు వాళ్లకి బంధువులు, లేదా ఫ్రెండ్స్ అయిన వాళ్ళు చేత హత్యకు గురయ్యారు. ఇటీవల ఒక మహిళను తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కొట్టి, తగలబెట్టడానికి ప్రయత్నించాడు. కానీ తగలబెట్టడానికి రాకపోవడంతో ఒక బ్యారెల్ లో ఆ మహిళను పెట్టి ఆ బ్యారెల్ ని కాంక్రీట్ తో నింపాడు.
టర్కీలో అలా మహిళలు చనిపోయినప్పుడు వాళ్ల బ్లాక్ అండ్ వైట్ ఫోటో టీవీలో కానీ, న్యూస్ పేపర్ లో కానీ, సోషల్ మీడియాలో కానీ పెడతారు. అలా తర్వాత రోజు మన ఫోటో కూడా వస్తుంది, కాబట్టి మహిళల హత్యలు ఆపాలి అని చెప్పడానికి టర్కీలో చాలామంది మహిళలు తమ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను షేర్ చేయడం మొదలుపెట్టారు.
తర్వాత ఇతర దేశాల ప్రజలు కూడా టర్కీ మహిళలకు మద్దతు ఇవ్వడానికి బ్లాక్ అండ్ వైట్ ఛాలెంజ్ ని మొదలుపెట్టారు అంతేకాకుండా వాళ్లకు తెలిసినవాళ్లని కూడా తమ బ్లాక్ అండ్ వైట్ ఫోటోల ద్వారా టర్కీకి మద్దతు తెలపడానికి ప్రోత్సహిస్తున్నారు. దాంతో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఈ ఛాలెంజ్ ద్వారా ఎంతోమంది ప్రజలు టర్కీ మహిళలకి మద్దతు ఇస్తున్నారు.
End of Article