అంబులెన్సు కి “108” నెంబర్ నే ఎందుకు పెట్టారు.? హిందూ ధర్మం ప్రకారం అలా..సైన్స్ ప్రకారం ఇలా.!

అంబులెన్సు కి “108” నెంబర్ నే ఎందుకు పెట్టారు.? హిందూ ధర్మం ప్రకారం అలా..సైన్స్ ప్రకారం ఇలా.!

by Mohana Priya

Ads

ఏదైనా ఒక ప్రదేశం లో హాస్పిటల్స్ అనేవి ఉండడం ఎంత ముఖ్యమో, హాస్పిటల్స్ కి చేర్చడానికి అంబులెన్స్ ఉండటం కూడా అంతే ముఖ్యం. 108 కి కాల్ చేస్తే అంబులెన్స్ వస్తుంది. ఈ విషయం చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ తెలుసు.

Video Advertisement

అయితే అంబులెన్స్ కి 108 అనే నంబర్ ఎమర్జెన్సీ నెంబర్ గా ఎందుకు ఉందో మీకు తెలుసా? అలా అంబులెన్స్ కి 108 ఎమర్జెన్సీ నెంబర్ గా ఉండడానికి కొన్ని కారణాలున్నాయి. అవేంటంటే.

#1 ఆధ్యాత్మిక కారణం(స్పిరిట్యువల్ రీజన్)

మొదటి కారణం ఏంటంటే జపమాల లో 108 పూసలు ఉంటాయట. ఒక జపాన్ని పూర్తి చేయడానికి ఆ మాలలోని పూసల కొలమానం తో పూర్తి చేస్తారు. ఆయుర్వేదంలో ఒక ప్రాణికి పుట్టుక ఇచ్చే ముందు 108 మర్మాలు ఉంటాయి అని అంటారు. అంటే మనిషి ఆత్మ 108 దశలలో ప్రయాణిస్తుందట.

అంతేకాకుండా బైబిల్ లో మాథ్యూ 10:8 లో ” రోగులకు రోగాన్ని నయం చేయండి, చనిపోయిన వారిని బతికించండి, అంటువ్యాధి (కుష్టు వ్యాధి) ఉన్నవారిని శుభ్రపరచండి, రాక్షసులను తరిమికొట్టండి. స్వేచ్ఛగా మీరు ఏమి అందుకున్నారో, స్వేచ్ఛగా ఇవ్వండి” (Heal the sick, raise the dead, cleanse those who have leprosy, cast out demons. Freely you have received, freely give) అని ఉంటుందట.

ఇస్లాం మతం లో108 సంఖ్యని దేవుడి తో పోలుస్తారట. ఏంజిల్ నంబర్స్ పరంగా 108 అనే నంబర్లకి సహాయం, ప్రోత్సాహం అని అర్థం వస్తాయట.

#2 సైన్స్ ప్రకారం

ఇంకొకటి ఏంటంటే ఈక్వేటర్ దగ్గర భూమి డయామీటర్ 7926 మైళ్లు ఉంటుందట. సూర్యుడి డయామీటర్ 108 సార్లు అంటే 865,000 ఉంటుందట. భూమికి సూర్యుడికి మధ్య ఉన్న యావరేజ్ డిస్టెన్స్ లేదా మిడ్ పాయింట్ డిస్టెన్స్ 93,020,000 మైళ్లు ఉంటుందట. అంటే సూర్యుడి డయామీటర్ 108 సార్లు చేసినట్టు అన్నమాట. అలాగే చంద్రుడి డయామీటర్ 2,180 మైళ్లు ఉంటుందట. అంటే భూమి నుండి చంద్రుడికి 238,800 మైళ్ల యావరేజ్ డిస్టెన్స్ ఉంటుంది. అంటే చంద్రుడి డయామీటర్ కి 108 సార్లు అన్నమాట.

#3 సైకాలజీ ప్రకారం

సైకాలజీ ప్రకారం ఒక మనిషి ఏదైనా ఇబ్బందుల్లో (స్ట్రెస్ లో) ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా కళ్ళు ఎడమవైపు వెళ్తాయట. అలా ముందు ఎడమవైపు పైన ఉన్న నెంబర్ వన్, తర్వాత కింద  ఉన్న జీరో, తర్వాత 8 నంబర్స్ మీదకి దృష్టి వెళ్తుందట. అంతేకాకుండా మగవాళ్ళని వన్ ఆడ వాళ్ళని జీరో తో రిప్రజెంట్ చేస్తారు, ఇంకా 8 అనేది ఇన్ఫినిటీ సింబల్ లేదా ఎటర్నిటీ ని సూచిస్తుందట. అంటే ఎవ్రీథింగ్ అని అర్థం. అలా జీవితంలో ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, లేదా ఒకటే రకంగా ఎక్స్పీరియన్స్ చేస్తారు (1), అసలు ఏమీ తెలీదు (0), అన్నీ తెలుసుకుని లైఫ్ ఎక్స్పీరియన్స్ చేస్తారు, లేదా అన్నీ తెలుసుకున్న లైఫ్ ఎక్స్పీరియన్స్ (8) ఇది కాన్షియస్ నెస్ లో డిఫరెంట్ స్టేజెస్ మీద ఆధారపడి ఉంటుందట.


End of Article

You may also like