హైదరాబాద్ లో వరదలకు కారణం ఏంటి.? గతంలో ఇలా ఎప్పుడైనా జరిగిందా.?

హైదరాబాద్ లో వరదలకు కారణం ఏంటి.? గతంలో ఇలా ఎప్పుడైనా జరిగిందా.?

by Mohana Priya

హైదరాబాద్ లో భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమైయ్యాయి. మోకాళ్ళ లోతు వరకు నీళ్లు ఉండడంతో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా. ఇండియా టైమ్స్ కథనం ప్రకారం ఐఎండి హైదరాబాద్ శాస్త్రవేత్త (మెటీయరాలజిస్ట్) బి. రాజా రావు మాట్లాడుతూ ఆగస్టు 2000 సంవత్సరంలో బేగంపేట్ లో 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని,

Video Advertisement

ఇప్పుడు గత 24 గంటల్లో హయత్ నగర్ పరిధిలో 29.8 సెంటిమీటర్ల వర్షం నమోదైందని, ఘట్కేసర్ లో 32.3 సెంటీమీటర్ల వర్షం నమోదైందని, సిటీలోని దాదాపు 35 ప్రదేశాల్లో 21 సెంటీమీటర్ల వర్షం రికార్డు అయిందని చెప్పారు.

గతంలో ఇలా ఎప్పుడైనా జరిగిందా.?

2000 సంవత్సరం ఆగస్టులో ఇలానే వరదలు వచ్చాయి.  1908, సెప్టెంబర్ 2వ తేదీన 153.2 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది, 1954 ఆగస్టు 1వ తేదీన 190.5 మిల్లీ మీటర్లు, ఆగస్టు 1970 లో 140 మిల్లీ మీటర్లు, ఆగస్టు 24వ తేదీ 2000 సంవత్సరంలో 240 మిల్లీమీటర్లు, ఆగస్ట్ 2001లో 230.4 మిల్లీ మీటర్లు, ఆగస్ట్ 2002లో 179.4 ఆగస్ట్ 2006 లో  218.7 మిల్లీ మీటర్లు, ఆగస్ట్ 2008 లో 220.7 మిల్లీ మీటర్లు, సెప్టెంబర్ 2016 లో 215 మిల్లీ మీటర్లు, ఇప్పుడు అక్టోబర్ 13వ తేదీ 2020 లో 45.4 మిల్లీమీటర్ల వర్షం నమోదయింది.

హైదరాబాద్ లో వరదలకు కారణం ఏంటి.?

అసలు సిటీ లో ఇంత భారీగా వరదలు రావడం ఏంటి అనే ప్రశ్న అందరిలో నెలకొంది. హైదరాబాద్ లో వరదలు రావడానికి కారణం ఏంటంటే, హైదరాబాద్ ఒక పరివాహక వ్యవస్థ. వెస్ట్రన్ ఎడ్జ్ (కూకట్ పల్లి, రామచంద్రపురం నుండి గచ్చిబౌలి వరకు) గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉంది. ఈస్ట్రన్ ఎడ్జ్ కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉంది. హైదరాబాద్ డెక్కన్ రీజియన్ లో ఉంది.

ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కొంచెం వేరేగా ఉంటుంది. అంటే స్లోప్ అనేది వేరే వేరే డైరెక్షన్స్ లో ఉంటాయి. అందుకే నీళ్లు కూడా ఒకటే డైరెక్షన్ లో వెళ్ళవు. ఈ ట్యాంక్స్ వ్యవసాయం కోసం ఉపయోగించుకునే వాళ్ళు. వీటి చుట్టూ ఉండే ఏరియాలు స్థానికంగా రక్షణ పొందుతున్న పరివాహక ప్రాంతాలు (ప్రొటెక్టెడ్ లోకల్ క్యాచ్మెంట్ ఏరియాస్). గత నలభై సంవత్సరాలుగా సిటీ మొత్తం వ్యవసాయ ప్రాంతం పైకి వచ్చేసింది.

బఫర్ ఏరియాస్ ఏమీ లేకుండా, నీటిపై రోడ్లను నిర్మించారు. అందుకు నెక్లెస్ రోడ్ ఒక ఉదాహరణ. ఇంకా ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీల నుండి వచ్చే వ్యర్థ పదార్థాలు, చెత్త కూడా చెరువుల్లోకి వెళుతున్నాయి. అలా పేరుకుపోయిన చెత్త వల్ల చెరువుల సామర్థ్యం మారి ఈ విధంగా ప్రభావం చూపింది. అంతేకాకుండా ఇంతకముందు హైదరాబాద్ నగరం చుట్టూ చాలా చెరువులు ఉండేవి. కానీ అందులో చాలా వరకు వ్యాపార స్థలాలుగా మారిపోయాయి. చెరువుల సంఖ్య తగ్గిపోవడం వల్ల వర్షపు నీరు వరదలాగా పారుతోంది.


You may also like