Ads
భారత్తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సమష్టిగా విఫలమైన కోహ్లీసేన ప్రత్యర్థి ముందు మోకరిల్లింది.రెండు టెస్టుల సిరీస్‌లో కివీస్ 1-0 ముందంజలోఉంది. మూడో రోజు ఆట ముగిసే సరికి 65 ఓవర్లలో నాలుగు వికెట్లకు 144 పరుగులు చేసిన భారత్.. నాల్గవ రోజు బ్యాటింగ్ కొనసాగించి రెండో ఇన్నింగ్స్ లో 191 పరుగులకే ఆలౌటైంది. భారత్ బ్యాటింగ్ లో మయాంక్ అగర్వాల్ (58), రహానే (29), పంత్ (25) పరుగులు చేసి ఫర్వాలేదనిపించారు. కివీస్ బౌలర్లలో సౌథీ 5/61, బౌల్ట్ 4/39 చుక్కలు చూపించారు.
Video Advertisement
టీమిండియా 191 పరుగులు మాత్రమే చేసి ప్రత్యర్థికి నామమాత్ర 9 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కివీస్ ఓపెనర్లు టామ్ లాథమ్ 7, టామ్ బ్లండెల్ 2 పరుగులతో లాంఛనాన్ని పూర్తి చేశారు.ఇది ఇలా ఉంటె…మ్యాచ్ అనంతరం ఓటమి గురించి మాట్లాడుతూ కోహ్లీ ఇలా అన్నారు. టాస్ గెలుచుకోలేకపోవడం చాలా కీలకమైందని.. ఓటమికి అదొక కారణమని పోటీ ఇవ్వలేకపోయినట్లు చెప్పాడు.
బ్యాటింగ్ విభాగం ఎంత కష్టపడినప్పటికీ తగినంత పోటీ ఇవ్వలేకపోయాం. కివీస్ బౌలర్లను ఒత్తడిలోకి నెట్టామని మేం అనుకోవడం లేదు. 220-230కు మించిన స్కోరు చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. మొదటి ఇన్నింగ్స్ తక్కువ స్కోర్ మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టేసింది. 7వికెట్లు పడేవరకూ బాగా ఆడాం. చివరి 3వికెట్లు మమ్మల్ని బాగా దెబ్బతీశాయి. ఆ 120పరుగులే జట్టుకు గెలుపును దూరం చేశాయి. మయాంక్, రహానె మాత్రమే ఓ టెంపోలో ఆడుతున్నారు.
End of Article