Home Filmy Adda అందుకే నాగార్జున బిగ్ బాస్ ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేయించారా.? అయితే ఈ వార్తలన్నీ నిజమేనా.?

అందుకే నాగార్జున బిగ్ బాస్ ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేయించారా.? అయితే ఈ వార్తలన్నీ నిజమేనా.?

by Mohana Priya

సమంత, నాగ చైతన్య గురించి ప్రస్తుతం ఎన్నో పుకార్లు వస్తున్నాయి. వారు ఇద్దరూ విడిపోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. సమంత కూడా తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఇంటి పేరు తీసేయడం, ఈ విషయంపై ఇంటర్వ్యూలో అడిగినా కూడా, “నేను సమయం వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి వాటికి స్పందిస్తాను” అని చెప్పడం, ఇంకా చర్చలకు దారి తీస్తున్నాయి.Reason behind Nagarjuna not attending the press meet of Telugu Bigg Boss 5

ఈ విషయం ఇంకా చర్చనీయాంశం అయ్యేలా ఇటీవల ఎన్నో విషయాలు జరిగాయి. అందులో ఒకటి సమంత సోషల్ మీడియాలో చేసే పోస్ట్ లు. సమంత చేసే పోస్టులు ఇప్పుడు వస్తున్న ఈ పుకార్లకి సంబంధించినట్టే అనిపిస్తున్నాయి. ఒక్కొక్కసారి మీడియాలో ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా రాస్తారు అని అర్థం వచ్చేలా పోస్ట్ చేస్తే, ఒక్కొక్కసారి మాత్రం నెగిటివిటీ ఇగ్నోర్ చేయాలి అని అర్థం వచ్చేలాగా పోస్ట్ చేస్తారు. ఇటీవల ఒక వెకేషన్ కి వెళ్లిన సమంత ఆ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేశారు.Reason behind Nagarjuna not attending the press meet of Telugu Bigg Boss 5

ఆ ఫోటోలలో సమంతతో పాటు తన స్నేహితురాలు, ప్రముఖ డిజైనర్ శిల్పా రెడ్డి ఉన్నారు. ఇదిలా ఉండగా, బిగ్ బాస్ తెలుగు షో మొదలయ్యే ముందు ఒక ప్రెస్ మీట్ జరుగుతుంది. ప్రతి సీజన్ కి ఆ ప్రెస్ మీట్ కచ్చితంగా ఉంటుంది. కానీ ఈసారి మాత్రం అది జరగలేదు. డైరెక్ట్ గా షో మొదలైపోయింది. అందుకు కారణం కూడా ప్రస్తుతం వస్తున్న పుకార్లకు సంబంధించినదే అని సమాచారం.Reason behind Nagarjuna not attending the press meet of Telugu Bigg Boss 5

బిగ్ బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జున ఒక వేళ ప్రెస్ మీట్ కి హాజరయితే అక్కడ నాగ చైతన్య, సమంతకి సంబంధించి ప్రశ్నలు అడిగి ఏమైనా ఇబ్బంది పెడతారేమో అనే ఉద్దేశంతో నాగర్జున ఈ ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేయించినట్టు ఒక వార్త వస్తోంది. అసలు ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉందో, లేదా ఇవన్నీ కేవలం పుకార్లు మాత్రమే నా అనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు.

You may also like