50 ఏళ్లకు దెగ్గరబడుతున్నా “నగ్మా” ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా.? ఆ తమిళ్ హీరో, తర్వాత క్రికెటర్.?

50 ఏళ్లకు దెగ్గరబడుతున్నా “నగ్మా” ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా.? ఆ తమిళ్ హీరో, తర్వాత క్రికెటర్.?

by Mohana Priya

Ads

90 టైంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు పొందారు నగ్మా. 1990 లో సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన బాఘి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. 1991 లో వచ్చిన పెద్దింటి అల్లుడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు నగ్మా. అదే సంవత్సరం నాగార్జునతో కిల్లర్ సినిమాలో నటించారు. తర్వాత 1992 లో మెగాస్టార్ చిరంజీవితో ఘరానా మొగుడు సినిమాలో నటించారు.

Video Advertisement

1994 లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన కాదలన్ సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగు పెట్టారు నగ్మా. ఈ సినిమా తెలుగులో ప్రేమికుడు పేరుతో డబ్ అయ్యింది. తర్వాత ఎన్నో తెలుగు, తమిళ్, భోజ్ పురి అలాగే కొన్ని మలయాళం, కన్నడ, ఒక బెంగాలీ, పంజాబీ, మరాఠీ సినిమాల్లో కూడా నటించారు నగ్మా.

నగ్మా తెలుగులో చివరిగా 2002 లో విడుదలైన అల్లరి రాముడు సినిమాలో కనిపించారు. అలాగే అదే సంవత్సరం విడుదలైన నిను చూడక నేనుండలేను సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించారు నగ్మా. 2004 లో నగ్మా రాజకీయాల్లోకి  అడుగుపెట్టారు.  అయితే నగ్మా వివాహం చేసుకోలేదు. అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి అనే వార్తలు వినిపిస్తున్నాయి.

నగ్మా స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడు ఒక తమిళ్ హీరోని ప్రేమించారు. ఆ హీరోని పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నారు. కానీ తర్వాత ఆ హీరో వేరొకరిని పెళ్లి చేసుకున్నారు. తర్వాత క్రికెటర్ సౌరవ్ గంగూలీ తో నగ్మా రిలేషన్ షిప్ లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. కానీ వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. ఈ విషయాన్ని నగ్మా ఒక సందర్భంలో చెప్పారు. ఒకవేళ తనకి నచ్చిన వ్యక్తి దొరికితే కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అని అన్నారు.


End of Article

You may also like