శ్రావణ మాసం వచ్చింది. ఈ శ్రావణ మాసంలో ఎంతో మంది పూజలను ఆచరిస్తారు. సాధారణంగా శ్రావణ మాసంలో మాంసాహారం జోలికి పోరు. ఇందుకు కారణం ఏంటో చాలా మందికి తెలిసే అవకాశం లేదు. ఆచారం కాబట్టి పాటిస్తున్నామని అనుకుంటాం. కానీ మనం పాటించే ఆచారం వెనుక ఒక కారణం ఉంటుంది. ఈ ఆచారం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

#1 సాధారణంగా హిందూ ధర్మం ప్రకారం మాంసాహారం నిషిద్ధం. కానీ చాలా మంది మాంసాహారం తీసుకుంటారు. అందుకే ధర్మం ప్రకారం ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో మాంసాహారం జోలికి వెళ్లరు. హిందూ మత గ్రంథాలైన భగవద్గీత, వేద పురాణం, మహాభారతంలో మాంసాహారం తీసుకోవడం తప్పు అని చెప్పారు.

why people dont eat non veg in sravana masam

దీనికి ఉదాహరణ, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ విధంగా అంటారు, “నాకు ఎవరైనా భక్తితో ఒక పువ్వు కానీ, పండు కానీ ఆకు కానీ, నీరు కానీ ఇస్తే నేను అది తీసుకుంటాను” అని చెప్తారు. అంతే కాకుండా కృష్ణ జన్మాష్టమి, రాఖీ పండగ, నాగుల పంచమి ఈ పండుగలు అన్నీ కూడా శ్రావణ మాసంలోనే వస్తాయి.

#2 శ్రావణమాసం అనేది వర్షాకాలంలో వస్తుంది. వర్షాకాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది. దాని వల్ల మనుషుల జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మాంసాహారం తినకపోవడం మంచిది. అందుకే శ్రావణ మాసంలో ఉపవాసం చేసే సమయంలో చాలా మంది తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకుంటారు.
అంతే కాకుండా, వర్షాకాలంలో అనేక నీటి సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. జంతువుల మాంసం కలుషితమయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే వర్షాకాలంలో మాంసాహారాన్ని నివారించడం చాలా మంది ఉత్తమంగా భావిస్తారు.
#3 చేపలు, అలాగే ఇతర జలచరాలు వర్షాకాలంలో సంతానోత్పత్తి చేస్తాయి. అప్పట్లో చేపలని పెట్టడానికి వేరేగా ఫార్మ్స్ లాంటివి ఉండేవి కాదు. దాంతో ఆ జలచరాల జాతిని అంతం చేసినట్టు అవ్వకూడదు అనే ఉద్దేశంతో అప్పట్లో శ్రావణ మాసంలో సీ ఫుడ్ తీసుకునే వాళ్లు కాదు.

హిందూ ధర్మం ప్రకారం ఏదైనా జీవిని చంపడం అనేది తప్పుగా భావిస్తారు. ఈ కారణంగానే చాలా మంది మాంసాహారం ముట్టుకోరు. అయితే శ్రావణ మాసంలో మాంసాహారం తినకపోవడానికి కొన్ని బలమైన కారణాలు మాత్రం ఇవే.