Pooja Hegde : పూజా హెగ్డే సడన్ “మాల్దీవ్స్ వెకేషన్” వెనకాల కారణం ఇదేనా..?

Pooja Hegde : పూజా హెగ్డే సడన్ “మాల్దీవ్స్ వెకేషన్” వెనకాల కారణం ఇదేనా..?

by Mohana Priya

Ads

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్స్‌లో ఒకరు పూజా హెగ్డే. ఇటీవల మోస్ట్ ఎలిజిలిబుల్ బ్యాచిలర్ సినిమాతో మరో హిట్ కొట్టిన పూజా హెగ్డే, ప్రస్తుతం రాధే శ్యామ్, అలాగే రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్న సర్కస్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

Video Advertisement

అలాగే మరి కొన్ని సినిమాలను కూడా పూజా హెగ్డే సైన్ చేసారు. ఇదిలా ఉండగా, పూజా హెగ్డే ప్రస్తుతం మాల్దీవ్స్ వెకేషన్‌లో ఉన్నారు. ఇందుకు సంబంధంచిన ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే, ఈ వెకేషన్ వెనకాల ఒక ముఖ్యమైన కారణం ఉందని సమాచారం. గత సంవత్సరం కూడా చాలా మంది సెలబ్రెటీలు మాల్దీవ్స్ వెకేషన్‌కి వెళ్లారు. వారందరికీ కూడా మాల్దీవ్స్ టూరిజంపై ప్రచారం చేయడానికి స్వయంగా మాల్దీవ్స్ టూరిజం యాజమాన్యం వెకేషన్‌కి వెళ్లే సౌకర్యం కల్పించారు.

reason behind pooja hegde maldives vacation

కానీ పూజా హెగ్డే మాత్రమే తన సొంత డబ్బులతో ఈ వెకేషన్‌కి వెళ్లినట్టు సమాచారం. దీనికి కారణం ఏంటంటే, ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో చాలా పాపులర్ అయిన పూజా హెగ్డే, ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా వరుసగా అవకాశాలు దక్కించుకునే పనిలో ఉన్నారట. ఈ కారణంగానే ఒక స్పెషల్ ఫోటోషూట్ చేయాలి అని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో పూజా హెగ్డే కేవలం టాలీవుడ్‌లో మాత్రమే కాదు, బాలీవుడ్ న్యూస్‌లో కూడా ఒక హాట్ టాపిక్ గా నిలిచారు.


End of Article

You may also like